Kantara Collections: సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొనిమరీ ఆదరిస్తారు అనడానికి నిదర్శనంగా నిలిచింది ఈ ఏడాది విడుదలైన కొన్ని సినిమాలు..వాటిల్లో మనం తప్పక మాట్లాడుకోవాల్సిన చిత్రం ‘కాంతారా’..కన్నడ చలన చిత్ర పరిశ్రమలో వసూళ్ల సునామి ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న ఈ సినిమా..తెలుగు మరియు హిందీ బాషలలో కూడా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది..ఈ సినిమాలో హీరో గా నటించిన రిషబ్ శెట్టి ఎవరో కూడా మన ఆడియన్స్ ఎవ్వరికి తెలియదు..కానీ కంటెంట్ అద్భుతంగా ఉండేలోపు అతని సినిమాకి ఇక్కడ స్టార్ హీరోలకు కూడా సాధ్యపడని థియేట్రికల్ రన్ ని ఇస్తున్నారు.

ఇప్పటికే ఇక్కడ విడుదలై పాతిక రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా..ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో అద్భుతమైన ఆక్యుపెన్సీలతో దూసుకుపోతుంది..ఈ స్థాయి స్టడీ రన్ బాహుబలి మరియు #RRR వంటి సినిమాలకు కూడా లేదు అనడం లో ఎలాంటి అతి సయోక్తి లేదు..25 రోజులకు గాను తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి ఈ ఆర్టికల్ లో చూద్దాము.
ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజం 12.20 కోట్లు
సీడెడ్ 3.00 కోట్లు
ఉత్తరాంధ్ర 3.50 కోట్లు
ఈస్ట్ 2.00 కోట్లు
వెస్ట్ 1.28 కోట్లు
నెల్లూరు 0.93 కోట్లు
గుంటూరు 1.56 కోట్లు
కృష్ణ 1.60 కోట్లు
మొత్తం 26.07 కోట్లు
ఓవర్సీస్ 3.40 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 29.77 కోట్లు
ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు కేవలం రెండు కోట్ల రూపాయలకు మాత్రమే కొనుగోలు చేసాడు..కానీ ఈ చిత్రం 25 రోజులకు గాను 30 కోట్ల రూపాయిల వరుకు షేర్స్ ని రాబట్టి గీత ఆర్ట్స్ కి ఈమధ్య కాలం లో ఎన్నడూ చూడనటువంటి లాభాల్ని చూపించింది ఈ సినిమా..ఇలా పెట్టిన డబ్బులకు పదింతలు ఎక్కువగా లాభాలు రావడం ఈమధ్య కాలం లో ఎప్పుడు జరగలేదు.

నిర్మాతలు ఈ సినిమా రైట్స్ ని అల్లు అరవింద్ కి అంత చీప్ గా అమ్మకుండా..వాళ్ళే డైరెక్ట్ గా తెలుగు లో విడుదల చేసుకొని ఉంటె కనివిని ఎరుగని రేంజ్ లాభాలు కేవలం తెలుగు నుండే వచ్చేవి అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం..ఈ సినిమా స్టడీ రన్ ని చూస్తుంటే మరో రెండు వారాలు అలవోకగా ఆడేసేటట్టు ఉంది.