Prince Box Office closing Collections : వరుస విజయాలతో దూసుకుపోతున్న తమిళ హీరో శివ కార్తికేయన్, తెలుగులో జాతి రత్నాలు వంటి సెన్షేషనల్ బ్లాక్ బస్టర్ తీసిన అనుదీప్ తో కలిసి ‘ప్రిన్స్’ అనే సినిమా తీసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా కి డివైడ్ టాక్ వచ్చింది..జాతి రత్నాలు రేంజ్ లో కామెడీ క్లిక్ అవ్వకపోవడం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద శివ కార్తికేయన్ కి ఎదురు దెబ్బ తగిలింది.

ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరించే విధంగానే ఉన్నప్పటికీ..సెకండ్ హాఫ్ పూర్తిగా రొటీన్ అయిపోవడం తో అభిమానులు, ప్రేక్షకులు నిరాశకి గురయ్యారు..దానివల్ల ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ పరాజయం చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది..శివ కార్తికేయన్ కి తెలుగు లో డాక్టర్ , డాన్ వంటి వరుస హిట్స్ రావడం, దానికి తోడు జాతి రత్నాలు మూవీ డైరెక్టర్ అవ్వడం తో తెలుగులో కూడా ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది.
తెలుగు లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 7 కోట్ల రూపాయలకు అమ్మడుపోయింది..ఓపెనింగ్ వీకెండ్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నప్పటికీ వీక్ డేస్ లో కలెక్షన్స్ కనీస స్థాయిలో కూడా హోల్డ్ చెయ్యలేకపోయింది..అందువల్ల కేవలం 3 కోట్ల రూపాయలకే బిజినెస్ క్లోజ్ అయిపోయింది..మరోపక్క తమిళం లో కూడా ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.
ఫుల్ రన్ లో ఇప్పటి వరుకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 40 కోట్ల రూపాయిల గ్రాస్ ని మాత్రమే వసూలు చేసింది..ఇది శివ కార్తికేయన్ కెరీర్ లోనే కాదు..తమిళ్ సినిమాలలో పెద్ద డిజాస్టర్ అనే చెప్పాలి..హిట్టు మీద హిట్టు కొడుతూ కోలీవుడ్ టాప్ 5 హీరోలలో ఒకడిగా ఎదుగుతున్న సమయం లో శివ కార్తికేయన్ కి ఇలాంటి ఫ్లాప్ పడడం అతి పెద్ద ఎదురు దెబ్బ..ఈ దెబ్బ నుండి ఆయన ఎలా కోలుకుంటాడో చూడాలి.