
Jagan – AP CID ఉద్దండులు ఏం చేయలేకపోయారు ఈ కుర్ర సీఎం ఏం చేస్తాడు అనుకున్నాడు ఆ పెద్దమనిషి.. నన్ను టచ్ చేసే మొగాడు ఇంకా పుట్టలేదు అంటూ ముసలి వయసులోనూ తొడగొట్టాడు. కానీ ‘తాటిని తన్నేవాడుంటే.. వాడి తలను తన్నేవాడుంటాడని’ జగన్ నిరూపించాడు. ప్రత్యర్థులంతా కలిసి 16 నెలలు జైలుకు పంపినా ఆయన స్థైర్యం కోల్పోదు. సరికదా.. ప్రజాబలంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. నిజంగానే జగన్ తన పాలనతో భయపట్టేస్తున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబునే మీడియా సాక్షిగా ఏడిపించిన జగన్ కు మిగతా వారు ఒక లెక్కనా? ఇప్పుడా ఆ పెద్దాయన కూడా మౌనంగా రోదిస్తున్నాట.. సీఐడీ విచారణ తర్వాత ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఉంటూ మౌనముద్ర వహిస్తున్నాడట.. అస్సలు బయటకు రావడం లేదట.. అవమానంతో కృంగి కృశించిపోతున్నట్టు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
మీడియా సామ్రాజ్యానికి అధిపతిగా తనకు చట్టాలు, నిబంధనలు వర్తించవని ఇన్నాళ్లు అక్కడ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను మేనేజ్ చేస్తూ గుండెలపై చేయి వేసుకొని హాయిగా ఎంజాయ్ చేశారు ఆ పెద్దమనిషి. తన కలల సామ్రాజ్యాన్ని టచ్ చేసే మొగాడు లేడనుకున్నాడు. సినిమాలోని డైలాగ్ లాగానే ఆయనకు ఇప్పుడు మూడింది. జగన్ రూపంలో వచ్చి భయపెడుతోంది.
వైఎస్ఆర్ సీఎం అయ్యాక కూడా ఈయన వ్యాపారాలపై ప్రత్యర్థుల నజర్ పడింది. నాడు వైఎస్ఆర్ కేసులు పెట్టినా అవి కోర్టుల్లో తేలిపోయాయి. దీంతో తనను ఎవరూ ఏం చేయలేరు అని ఆ పెద్దమనిషి మరింత ధైర్యంగా ఉన్నాడు. కానీ అందరూ వదిలేసినా మొండిఘటమైన జగన్ వదల్లేదు. ఇప్పుడు ఆ అక్రమాలను తవ్వితీస్తున్నాడు.
జగన్ ప్రభుత్వం-ఏపీ సీఐడీ తాజాగా ఈ అక్రమాలపై దాడి చేయడం.. ఆ పెద్దాయనను ఆయన ఇంట్లోకి వచ్చి మరీ విచారించడం సంచలనమైంది. పోలీసులు ఇంతవరకూ తన గడపతొక్కలేదు. అలాంటిది ఆయన బెడ్ రూంలోకి వచ్చి విచారించేసరికి అవమానంతో ఒంటరిగా మారిపోయాడట. ఆయనకు సహకారం అందించేందుకు ఏపార్టీ కానీ ముందుకు రాలేదు. ఏమాత్రం లాబీయింగ్ చేయలేదన్న ఆవేదన ఆ పెద్దమనిషిలో వ్యక్తమవుతోందట.. తనకు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కష్టకాలంలో తాను నిలబెట్టిన పార్టీ స్పందించడం లేదు. కేంద్రంలోని పార్టీ జగన్ ను ఆపడం లేదు. దోస్తు అయినా కూడా రాష్ట్రపార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. అందుకే ఆ పెద్దాయన మథనపడుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీంట్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.