Kiraak RP Marriage : లవర్ తో జబర్దస్త్ కిరాక్ ఆర్పీ రహస్య వివాహం… అమ్మాయి వివరాలు ఇవే! 

పెళ్లి మాత్రం నిరాడంబరంగా చేసుకున్నాడు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. కిరాక్ ఆర్పీ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మేటర్ లీక్ అయ్యింది. దీంతో అభిమానులు కిరాక్ ఆర్పీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకడు. చాలా కాలం షోలో కొనసాగాడు. టీమ్ లీడర్ కూడా అయ్యాడు.

Written By: NARESH, Updated On : November 29, 2023 9:02 pm
Follow us on

Kiraak RP Marriage : కిరాక్ ఆర్పీ గుట్టుచప్పుడు కాకుండా ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు. ఈ మేటర్ హాట్ టాపిక్ గా మారింది. కిరాక్ ఆర్పీ వివాహం నవంబర్ 29న వైజాగ్ లో జరిగింది. ఈ విషయాన్ని అతడు స్వయంగా వెల్లడించాడు. వివరాల్లోకి వెళితే గత మూడేళ్ళుగా లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయిని కిరాక్ ఆర్పీ ప్రేమిస్తున్నాడు. ఏడాది క్రితం లక్ష్మీ ప్రసన్నతో నిశితార్థం జరిగింది. మిత్రులు, సన్నిహితులు, బుల్లితెర ప్రముఖులు కిరాక్ ఆర్పీ-లక్ష్మీ ప్రసన్న ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరయ్యారు.

పెళ్లి మాత్రం నిరాడంబరంగా చేసుకున్నాడు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. కిరాక్ ఆర్పీ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మేటర్ లీక్ అయ్యింది. దీంతో అభిమానులు కిరాక్ ఆర్పీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకడు. చాలా కాలం షోలో కొనసాగాడు. టీమ్ లీడర్ కూడా అయ్యాడు.

షో నుండి బయటకు వచ్చాక జబర్దస్త్ నిర్మాతలపై ఆరోపణలు చేశారు. మల్లెమాల వాళ్ళు దోచు కోవడమే కానీ నటులకు సరైన పారితోషికాలు ఇవ్వరు. కనీసం మంచి భోజనం పెట్టరు అని తీవ్ర కామెంట్స్ చేశాడు. దర్శకుడు కావాలని ఓ సినిమా స్టార్ట్ చేయగా అది మధ్యలో ఆగిపోయింది. లాభం లేదని వ్యాపారిగా మారి సక్సెస్ అయ్యాడు. కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కూకట్ పల్లిలో కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు.

దీనికి విశేష ఆదరణ దక్కింది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం సక్సెస్ కావడంతో లక్షలు సంపాదిస్తున్నాడు. మణికొండలో ఒక బ్రాండ్ స్టార్ట్ చేశాడు. ఇటీవల ఆంధ్రాకు కూడా తన వ్యాపారం విస్తరించాడు. తిరుపతిలో ఇటీవల కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాడు. మంత్రి రోజా, హీరోయిన్ మెహ్రీన్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్ ఓపెన్ చేయడం విశేషం. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం పుణ్యమా అంటూ ఓ ఇంటి వాడు కూడా అయ్యాడు.