Chiranjeevi : చిరంజీవి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. తండ్రి వెంకట్రావు కానిస్టేబుల్, తల్లి అంజనమ్మ హౌస్ వైఫ్. చిరంజీవి ఇంటికి పెద్దవాడు. ఈయనకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెల్లు. నాగబాబు నటుడిగా నిర్మాతగా మనకు పరిచయమే. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. చిరంజీవి స్వశక్తితో స్టార్ హీరో అయ్యారు. ఎలాంటి నేపథ్యం లేకపోయినప్పటికీ చిరంజీవి తిరుగులేని స్టార్డం తెచ్చుకున్నారు.
చదువు పూర్తి అయ్యాక చిరంజీవి చెన్నై వెళ్లి యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యారు. నటుడిగా ఎదిగే క్రమంలో ఆయనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. హీరో అవుదామని వచ్చావా..? అని ఎగతాళి చేసినవారు కూడా ఉన్నారట. పట్టుదలతో హీరో కావాలన్న లక్ష్యం నెరవేర్చుకున్నాడు చిరంజీవి. 70లలో చిరంజీవి నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టాడు. 80ల చివరి నాటికి చిరంజీవి కెరీర్ పీక్స్ కి చేరింది. నెంబర్ వన్ హీరో పొజిషన్ అందుకున్నాడు.
చిరంజీవి స్టార్ అయ్యాక ఆయన కుటుంబం చెన్నై కి షిఫ్ట్ అయ్యింది. చెన్నైలో సొంత ఇంటిని నిర్మించుకుని చిరంజీవి కుటుంబం అక్కడే ఉండేది. 90ల నాటికి టాలీవుడ్ పూర్తిగా చెన్నై నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. స్టూడియోలు, ఇతర సౌకర్యాలకు కోసం చెన్నై మీద ఆధారపడటం తగ్గింది. చిరంజీవి హైదరాబాద్ లో మరో ఇల్లు నిర్మించుకున్నారు. చాలా కాలం అక్కడే ఉన్న చిరంజీవి జూబ్లీహిల్స్ లో ఓ దశాబ్దం క్రితం అత్యంత విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారు.
చిరంజీవి కొత్త ఇల్లు జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి సమీపంలో ఉంది. కొండ మీద చిరంజీవి ఇంటి నిర్మాణం జరిగింది. దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఇంటిని ప్రముఖ ముంబై డిజైనర్ తరుణ్ తహిలియానీ రూపొందించారట. అత్యాధునిక సౌకర్యాలు ఈ ఇంట్లో ఉన్నాయి.
విశాలమైన గార్డెన్, జిమ్, పూజ గది, కిచెన్, లైబ్రరీ, హోమ్ థియేటర్ తో పాటు అనేక సౌకర్యాలు ఆ ఇంటి సొంతం. ముఖ్యంగా రెండో ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఉదయం సూర్యోదయాన్ని, సాయంత్రం అస్తమయాన్ని ఆస్వాదిస్తూ స్విమ్ చేయవచ్చు. కొండ మీద నిర్మించిన ఇల్లు కావడంతో చల్లని గాలి వీస్తూ ఉంటుందట. ఈ ఇంటి కోసం అప్పట్లోనే రూ. 100 కోట్ల వరకు చిరంజీవి వెచ్చించారని సమాచారం.
ప్రస్తుత మార్కెట్ ధర అంతకు మించి ఉంటుంది. చిరంజీవికి బెంగుళూరులో కూడా లగ్జరీ హౌస్ ఉంది. అది ఫార్మ్ హౌస్ అని సమాచారం. 2024 దసరా వేడుకలను చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ అక్కడే కలిసి జరుపుకున్నారు. చిరంజీవి కుటుంబానికి వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఒక నిర్మాణ సంస్థ ఉంది. ప్రైవేట్ జెట్ కలిగిన అతికొద్ది మంది హీరోల్లో చిరంజీవి ఒకరు. ఇండియా వైడ్ ఎక్కడికి వెళ్లాలన్నా ఆ ప్రైవేట్ జెట్ లోనే వెళతారు. అలాగే రామ్ చరణ్, ఉపాసన ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంటుంది. అపోలో గ్రూప్ లో ఉపాసన వాటా విలువ రూ. 10 వేల కోట్లకు పైమాటే అని సమాచారం.
Web Title: Know interesting details about chiranjeevi new luxury house in hyderabad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com