https://oktelugu.com/

గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా ఎందుకు కొలుస్తారో తెలుసా.?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలను పాటిస్తుంటారు. ఈ ఆచారాలను పాటించడంతో పాటు, వాస్తు శాస్త్రానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఈ వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు కొంతమంది మన ఇంట్లో గవ్వలను ఉంచుకోవడం శుభంగా పరిగణిస్తారు. మరికొంతమంది గవ్వలను ఇంట్లో ఉంచకూడదని భావిస్తుంటారు. అయితే గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారని గవ్వలు ఇంట్లో ఉండటంవల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. గవ్వలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 8, 2021 / 08:56 AM IST
    Follow us on

    మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలను పాటిస్తుంటారు. ఈ ఆచారాలను పాటించడంతో పాటు, వాస్తు శాస్త్రానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఈ వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు కొంతమంది మన ఇంట్లో గవ్వలను ఉంచుకోవడం శుభంగా పరిగణిస్తారు. మరికొంతమంది గవ్వలను ఇంట్లో ఉంచకూడదని భావిస్తుంటారు. అయితే గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారని గవ్వలు ఇంట్లో ఉండటంవల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. గవ్వలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

    Also Read: గురువారం బృహస్పతిని పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

    పురాణాల ప్రకారం గవ్వలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కనుక గవ్వలను ఇంట్లో పెట్టుకొని పూజించటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని భావిస్తారు. అలాగే పురాతన కాలం నుంచి దీపావళి రోజున గవ్వలను ఆడటం ఆనవాయితీగా వస్తోంది. పూర్వం అమృతం కోసం రాక్షసులు, దేవతలు సాగర మధనం చేస్తున్నప్పుడు సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామదేనువు వంటివి ఉద్భవిస్తాయి. గవ్వలు కూడా సముద్రంలో ఉంటాయి కాబట్టి గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.

    Also Read: రావి చెట్టుకు పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

    ఈ విధంగా గవ్వలను లక్ష్మీదేవిగా భావించడం వల్ల మన ఇంట్లో గవ్వలను పూజ గదిలో ఉంచుకొని పూజ చేయడం ద్వారా లక్ష్మి దేవత కొలువై ఉంటుందని చెప్పవచ్చు.వ్యాపారాలు చేసేవారు తెల్లటి వస్త్రములో ఉంచి డబ్బులు పెట్టే చోట గవ్వలను పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరనివారు గవ్వలను జోబులో పెట్టుకోవటం వల్ల పెళ్లి ఘడియలు దగ్గర పడతాయి. నల్లటి దారంలో ఈ గవ్వను వేసుకొని మెడలో కట్టుకోవడం ద్వారా ఎటువంటి నరదృష్టి తగలదని పెద్దలు చెబుతుంటారు. అయితే పసుపు రంగులో ఉండే గవ్వలను పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం