https://oktelugu.com/

టీజర్ టాక్: ‘కేజీఎఫ్2’ అంచనాలకు మించి..

ఒక కన్నడ సినిమా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించింది చాలా తక్కువే ఉన్నాయి.. తమిళ సినిమాలు ఆడినవి ఉన్నాయి. తెలుగు నుంచి బాహుబలి సినిమాలు ఆదరణ పొందాయి. అదే క్రమంలో కన్నడ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’ చిత్రం దేశ చిత్రరంగంలోనే ఓ సంచలనం. హీరో యష్ ఈ సినిమాలో నటించిన తీరు.. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభకు కలెక్షన్లు, అభినందనలు దక్కాయి. Also Read: ‘క్రాక్’ కిరాక్ బిజినెస్.. అన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : January 7, 2021 / 10:51 PM IST
    Follow us on

    ఒక కన్నడ సినిమా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించింది చాలా తక్కువే ఉన్నాయి.. తమిళ సినిమాలు ఆడినవి ఉన్నాయి. తెలుగు నుంచి బాహుబలి సినిమాలు ఆదరణ పొందాయి. అదే క్రమంలో కన్నడ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’ చిత్రం దేశ చిత్రరంగంలోనే ఓ సంచలనం. హీరో యష్ ఈ సినిమాలో నటించిన తీరు.. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభకు కలెక్షన్లు, అభినందనలు దక్కాయి.

    Also Read: ‘క్రాక్’ కిరాక్ బిజినెస్.. అన్ని కోట్లా?

    ఇప్పుడు దానికి కొనసాగింపుగా తీస్తున్నదే ఈ ‘కేజీఎఫ్2’. అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కేజీఎఫ్2’ టీజర్ ను హీరో యశ్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం రాత్రియే విడుదల చేశారు.

    టీజర్ చూస్తే ఆ సీన్లు, ఎలివేషన్లు.. చిత్రీకరణ గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది. ఆద్యంతం అలరించేలా సాగిన ఈ టీజర్ పై అంచనాలు పెంచుతోంది.

    కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ ను మించేలా రెండోపార్ట్ ను తిర్చిదిద్దినట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. అమ్మకిచ్చిన మాట కోసం హీరో పోరాడిన తీరు.. బంగారు గనుల్లో పోరాడిన సీన్లు.. ప్రియురాలికి తోడుగా నిలిచిన విధానం.. ఇక హీరో యష్ జీపులను గన్ తో పేలుస్తున్న సీన్లు హైలెట్ గా నిలిచాయి. హీరో ఎలివేషన్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ రేంజ్ లో చూపించాడు.

    Also Read: ‘సమంత’ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

    కేజీఎఫ్2లో విలన్ గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు. అధీరగా కనిపించనున్నాడు. తొలి పార్ట్ లో అధీర పాత్రను చూపించలేదు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ హీరోను విలన్ గా చూపించడం విశేసం. ఇక రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేశ్ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

    తొలి భాగంలో గరుడను చంపిన హీరో రాకీ.. రెండో భాగంలో కేజీఎఫ్ ను ఎలా దక్కించుకున్నాడు.. అధీర ఎలా తిరిగొచ్చాడు? కేజీఎఫ్ కోసం మాటు వేసిన వారిని ఎలా ఎదుర్కొన్నాడు.? భారత ప్రభుత్వంతో ఎలా ఫైట్ చేశాడన్నది ఈ సెకండ్ పార్ట్ లో చూపించబోతున్నారు.

    మొత్తంగా యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్ గూస్ బాంబ్స్ కలిగిస్తూ దుమ్మురేపుతోంది. మరి సినిమా ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్