జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక ప్రకటన.. టీఆర్ఎస్ లో గుబులు

ఓవైపు బీజేపీ కార్పొరేటర్ల ‘ప్రగతి భవన్’ ముట్టడి.. మరోవైపు జీహెచ్ఎంసీలో ఎన్నికలు జరిగి నెల కావస్తున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోని వైనం.. ఇలా జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గంపై ఏం చేయాలో తెలియక సీఎం కేసీఆర్ ఇన్నాళ్లుగా మౌనం పాటిస్తున్నారు. Also Read: టీపీసీసీ చీఫ్.. చావు కబురు చల్లగా చెప్పారు.. ఎందుకంటే జీహెచ్ఎంసీలో హంగ్ వచ్చింది. ఏపార్టీకి మెజార్టీ రాలేదు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు షాకిచ్చారు. టీఆర్ఎస్ తో సమానంగా బీజేపీకి కార్పొరేషన్ సీట్లు ఇచ్చారు. ఈ […]

Written By: NARESH, Updated On : January 8, 2021 5:55 pm
Follow us on

ఓవైపు బీజేపీ కార్పొరేటర్ల ‘ప్రగతి భవన్’ ముట్టడి.. మరోవైపు జీహెచ్ఎంసీలో ఎన్నికలు జరిగి నెల కావస్తున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోని వైనం.. ఇలా జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గంపై ఏం చేయాలో తెలియక సీఎం కేసీఆర్ ఇన్నాళ్లుగా మౌనం పాటిస్తున్నారు.

Also Read: టీపీసీసీ చీఫ్.. చావు కబురు చల్లగా చెప్పారు..

ఎందుకంటే జీహెచ్ఎంసీలో హంగ్ వచ్చింది. ఏపార్టీకి మెజార్టీ రాలేదు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు షాకిచ్చారు. టీఆర్ఎస్ తో సమానంగా బీజేపీకి కార్పొరేషన్ సీట్లు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏం చేయాలో తెలియక సీఎం కేసీఆర్ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.

జీహెచ్ఎంసీలో అటు ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే మత ముద్ర వేయడానికి బీజేపీ కాచుకు కూర్చుంది. రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది. ఇటు బీజేపీతో కలిసి గ్రేటర్ పీఠం పంచుకుంటే మైనార్టీ ఓటు బ్యాంకుకు దెబ్బ. అస్సలు ప్రత్యర్థిగా మారిన బీజేపీతో కేసీఆర్ కలిసే చాన్స్ లేదు. అందుకే ఇన్నాళ్లుగా ఈ పీటముడిని ఎలా విప్పాలో తెలియక సీఎం కేసీఆర్ ప్రస్తుతానికి వదిలేశాడు.

అయితే బీజేపీ ఒత్తిడి నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక జరుగుతుందని తెలిపింది. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు 11న మేయర్, డిప్యూటీ మేయర్ ను ఎన్నుకుంటారు. ఎన్నికైన సభ్యుల వివరాలను త్వరలోనే తెలంగాణ స్టేట్ గెజిట్ లో ప్రచురిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. జనవరి 11లోగా కొత్త సభ్యుల వివరాలను పబ్లిస్ చేస్తే.. తొలి మీటింగ్ ఫిబ్రవరి 11లోగా నిర్వహించాల్సి ఉంటుంది.

Also Read: ఉత్కంఠ: కేసీఆర్ ఆరోగ్యానికి అసలేమైంది?

ఇక గెలిచినవారు.. పోటీచేసిన వారు.. తమ ఎన్నికల ఖర్చు వివరాలను జనవరి 17లోగా అందజేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. లేకపోతే పోటీకి అర్హత కోల్పోతారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్