IT Notice To CBN : బిగ్ బ్రేకింగ్: లంచం తీసుకున్నందుకు చంద్రబాబుకు ఆర్థికశాఖ నోటీసులు

చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. శ్రీనివాస్ ద్వారానే మనోజ్ వాసుదేవ్ చంద్రబాబుకు ముడుపులు చెల్లించినట్లు శాఖ గుర్తించినట్లు హిందుస్థాన్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

Written By: Dharma, Updated On : September 1, 2023 11:21 am

I-T-department-serves-show-cause

Follow us on

IT Notice To CBN : చంద్రబాబుకు బిగ్ షాక్. ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నారని అభియోగాలు చంద్రబాబుపై ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో చంద్రబాబు ఇచ్చిన సమాధానం, అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది.

టిడిపి ప్రభుత్వ హయాంలో బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఆదాయ పన్ను శాఖ ప్రాథమిక ఆధారాలను సేకరించింది. షాపూర్ జి పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని ఇంట్లో ఐటీ శాఖ చేసిన తనిఖీల్లో చంద్రబాబు పాత్ర బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ స్వయంగా ఒప్పుకున్నారు.ఇందులో చంద్రబాబు కార్యదర్శి శ్రీనివాస్ పేరు బయటపడింది. ఆయన ద్వారానే చంద్రబాబు పేరు వెలుగులోకి వచ్చింది.

ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని చంద్రబాబును ఐటి శాఖ ప్రశ్నించింది. అయితే దీనిపై చంద్రబాబు అభ్యంతరాలు తెలపగా ఐటీ శాఖ తిరస్కరించింది. ఆగస్టు 4న హైదరాబాదులోని ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం సెక్షన్ 153 సి కింద చంద్రబాబుకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం తదితర భవనాలను నిర్మించారు. ఆ సమయంలో అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి దోచుకున్నారని విపక్షాలు ఆరోపించాయి. ఇలా కాంట్రాక్టర్ పొందిన కంపెనీల్లో షాపూర్జీ పల్లోంజీ ఒకటి. ఆ సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ నివాసంలో 2019 నవంబర్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. అక్కడ దొరికిన సమాచారం మేరకు చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. శ్రీనివాస్ ద్వారానే మనోజ్ వాసుదేవ్ చంద్రబాబుకు ముడుపులు చెల్లించినట్లు శాఖ గుర్తించినట్లు హిందుస్థాన్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వాటి ఆధారంగానే ఐటీ శాఖ అధికారులు ఇప్పుడు చంద్రబాబుకు మరోసారి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.