https://oktelugu.com/

చెన్నైలో రైతు ఇంట్లో ఐటీ దాడులు.. ఎన్ని కోట్లు దొరికాయంటే…?

సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు వ్యాపారులు, రాజకీయ నాయకులు, వాళ్ల బినామీలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులపై దాడులు చేస్తూ ఉంటారని మనందరికీ తెలిసిందే. అయితే తమిళనాడు లో మాత్రం ఒక రైతు ఇంటిపై దాడి చేశారు. ఆర్థికంగా బాగా నష్టపోయిన ఒక రైతు గడిచిన రెండు సంవత్సరాలలో భారీ మొత్తం ఖర్చు చేసి ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వచ్చింది. దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 29, 2020 9:20 am
    Follow us on


    సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు వ్యాపారులు, రాజకీయ నాయకులు, వాళ్ల బినామీలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులపై దాడులు చేస్తూ ఉంటారని మనందరికీ తెలిసిందే. అయితే తమిళనాడు లో మాత్రం ఒక రైతు ఇంటిపై దాడి చేశారు. ఆర్థికంగా బాగా నష్టపోయిన ఒక రైతు గడిచిన రెండు సంవత్సరాలలో భారీ మొత్తం ఖర్చు చేసి ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వచ్చింది.

    దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆ రైతు ఇంటిపై ఐటీ దాడులు జరిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా బన్రూటి ప్రాంతానికి సమీపంలో ఉన్న ముత్తుకృష్ణాపురం గ్రామంలో సుగీష్‌ చంద్రన్‌ అనే రైతు ఉండేవాడు. ఒకప్పుడు వీరికి పంట పొలాలు ఎక్కువగా ఉండేవి. అయితే వివిధ కారణాల వల్ల ఆర్థికపరమైన కష్టాలు చుట్టుముట్టడంతో ఆస్తులు ఒక్కొక్కటిగా కరిగిపోయాయి.

    అయితే ఆస్తులు కరిగిపోయినా గడిచిన రెండు సంవత్సరాల నుంచి వీళ్ల సంపద అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ఆ రైతు మళ్లీ కోటీశ్వరుడు అయ్యాడు. అయితే ఆస్తులు పెరగడం వెనుక ఆయన కూతురు, కొడుకు ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే స్థలాల పత్రాలతో పాటు భారీ మొత్తంలో నగదు దొరికిందని సమాచారం.

    శక్రవారం రాత్రి ఐటీ దాడులు మొదలు కాగా నిన్న రాత్రి వరకు దాడులు కొనసాగాయి. అధికారులు రైతును విచారించి ఆ ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. అధికారులు రైతుతో పాటు ఆయన కొడుకు, కూతురు, అల్లుడులను కూడా విచారించనున్నారని సమాచారం. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.