2వ వన్డే: బరిలోకి దిగిన డేవిడ్, ఫించ్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో ఆదివారం రెండో మ్యాచ్ ప్రారంభమైంది. మరోసారి టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించిన ఆసీస్ రెండో మ్యాచ్ లోనూ విన్నయ్యేందుకు తహతహలాడుతోంది. ఇక మొన్న మిస్ చేసుకున్న మ్యాచ్ ను ఈరోజు గెలిచి సమయం చేయాలని భారత క్రీడాకారులు ఉవ్విళ్లూరుతున్నారు. మొన్నటి మ్యాచ్ లో భారత ఆటగాళ్ల ప్రదర్శన తీరు బాగోలేదని ఐసీసీ వారి మ్యాచ్ ఫీజులో కోత విధించిన […]

Written By: Suresh, Updated On : November 29, 2020 9:18 am
Follow us on

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో ఆదివారం రెండో మ్యాచ్ ప్రారంభమైంది. మరోసారి టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించిన ఆసీస్ రెండో మ్యాచ్ లోనూ విన్నయ్యేందుకు తహతహలాడుతోంది. ఇక మొన్న మిస్ చేసుకున్న మ్యాచ్ ను ఈరోజు గెలిచి సమయం చేయాలని భారత క్రీడాకారులు ఉవ్విళ్లూరుతున్నారు. మొన్నటి మ్యాచ్ లో భారత ఆటగాళ్ల ప్రదర్శన తీరు బాగోలేదని ఐసీసీ వారి మ్యాచ్ ఫీజులో కోత విధించిన విషయం తెలిసిందే. దీనికి కోహ్లి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. బౌలింగ్ ప్రదర్శన సరిగా లేదని కోహ్లి తెలిపారు. అయితే ఈరోజు కూడా ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత బౌలింగ్ పైనే ఆధారపడినట్లు తెలుస్తోంది. కాగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, ఆరన్ పిచ్ లు మైదానంలోకి దిగి బ్యాటింగ్ చేస్తున్నారు.