https://oktelugu.com/

Salaar OTT: సలార్ మూవీ ఇంత తొందర గా ఓటిటి లోకి రావడానికి కారణం ఇదేనా..? ఇంతకీ ఏ ఓటిటి అంటే..?

Salaar OTT ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ సలార్ సినిమాని స్ట్రీమింగ్ చేస్తుంది...ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమాని చూడడానికి ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : January 20, 2024 11:34 am
Salaar OTT

Salaar OTT

Follow us on

Salaar OTT: ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన థియేటర్ లోకి వచ్చి మంచి సక్సెస్ ని సాధించింది. ఇక దాదాపు ఈ సినిమా 700 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఇక ప్రభాస్ కి బాహుబలి సినిమా తర్వాత ఒక హిట్టు కూడా పడలేదు. దాంతో సలార్ సినిమాతో మరొకసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఇలాంటి క్రమంలో సినిమా రిలీజ్ అయ్యి ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాకముందే శుక్రవారం రోజు( జనవరి 20) అర్ధరాత్రి ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ సలార్ సినిమాని స్ట్రీమింగ్ చేస్తుంది…ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమాని చూడడానికి ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే చాలామంది ఈ సినిమాని థియేటర్ లో చూసేసారు. అయిన కూడా మరొకసారి ఓటిటి లో చూడాలనే ఉద్దేశ్యం తో ఈ సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఫ్రెండ్షిప్ అనే పదానికి ఒక గొప్ప అర్ధాన్ని ఇచ్చే విధంగా ఈ సినిమా ను తెరకెక్కించారు. ఇక సెకండ్ పార్ట్ లో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య శత్రుత్వం మొదలైతే ఎలా ఉంటుందో కూడా ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. మొత్తానికైతే ఈ సినిమా ఓటిటి లో కూడా భారీ విజయాన్ని అందుకునే దిశగా ముందుకు దూసుకెళ్తుంది అంటూ సమాచారం అందుతుంది. ఇక ఇప్పటికే థియేటర్ లో రన్ అవుతున్న ఈ సినిమా నెల రోజులకు ముందే ఓటిటిలోకి రావడం అనేది ఒక వంతుకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నప్పటికీ ఓటిటి జనాలను కూడా ఎక్కువగా ఆకర్షించాలనే ఉద్దేశ్యం తోనే ఈ సినిమాని తొందరగా ఓటిటి లోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా కంటే ముందు రిలీజ్ అయిన అనిమల్ సినిమా ఇంకా ఓడిటిలోకి రాలేదు.సలార్ తొందరగా రావడాన్ని బట్టి చూస్తుంటే సలార్ సినిమా ఓటిటి బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే హోమ్ బలే ఫిలిమ్స్ వారు ఈ సినిమాని 400 కోట్లు పెట్టి తెరకెక్కించారు. ఇక మీలో కూడా ఎవరైనా ఇంకా సలార్ సినిమా చూడకపోయింటే నెట్ ఫ్లిక్స్ లో ఉంది చూసేయండి…