Homeఅంతర్జాతీయంDonald Trump: ఇరాన్‌తో ట్రంప్‌ సయోధ్య.. రాయబారం నెరపుతున మస్క్‌!

Donald Trump: ఇరాన్‌తో ట్రంప్‌ సయోధ్య.. రాయబారం నెరపుతున మస్క్‌!

Donald Trump: హమాస్‌ అంతమే లక్ష్యంగా దాడులు మొదలు పెట్టిన ఇజ్రాయెల్‌.. క్రమంగా యుద్ధాన్ని విస్తరిస్తూ పోతోంది. పాలస్తీనాలోని ఇజ్రాయెల్‌ స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్‌ తర్వాత లెబనాన్‌లోని హెజ్‌బొల్లాను టార్గెట్‌ చేసింది. హమాస్‌ చీఫ్‌తోపాటు హెజ్‌బొల్లా కీలక నేతలను మట్టునపెట్టింది. దీంతో ఆగ్రహించిన ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై క్షిపుణులతో దాడి చేసింది. అయితే వీటిని తిప్పికొట్టిన ఇజ్రాయెల్‌.. ఇరాన్‌పై దాడకి ఇసిద్దమవుతోంది. దీంతో పశ్చిమాసియాసియాలో పరస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ తరుణంలో అణు దాడికి కూడా వెనుకాడేది లేదని ఇరాన్‌ ప్రకటించింది. దీంతో అమెరికా కూడా ఇరాన్‌ను హెచ్చరించింది. ఈరుణంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు రావడం, నూతన అధ్యక్షుడిగా ట్రంప్‌ ఘన విజయం సాధించడంతో పరిస్థితులు మారుతున్నాయి.

ట్రంపు సయోధ్య..
యుద్ధాలకు వ్యతిరేకమని ఎన్నికల సమయంలోనే ప్రకటించిన ట్రంప్‌.. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత యుద్ధాలకు స్వస్తి పలికే చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికు రష్యా–ఉక్రెయిన్‌ వార్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేలా పుతిన్‌తో చర్చలు జరిపారు. తాజాగా ఇజ్రాయెల్‌ కారణంగా అమెరికా, ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోయేలా.. ఇరాన్‌తో సయోధ్యకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రంప్‌ గెలుపులో కీలకంగా వ్యవహరించి.. కొత్త ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టబోయే మిలియనీయర్, టెస్లా సీఈవో మస్క్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో టెహ్రాన్‌ రాయబారి అమీర్‌ సయీద్‌ ఇరవానీతో మస్క్‌ రహస్యంగా భేటీ అయ్యారు. గంటకుపైగా వీరు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఇరాన్‌ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలపైనే ఇద్దరూ చర్చించారని తెలిసింది. వీరి సమావేశం ఫలప్రదం అయిందని పేర్కొంది. ఇరాన్‌పై విధించిన ఆంక్షలు తొలగించాలని ఇరాన్‌ కోరింది. టెహ్రాన్‌తో వాణిజ్యం చేయాలని ఆ దేశ రాయబారి మస్క్‌ను కోరినట్లు వెల్లడించింది.

అధికారికంగా ధ్రువీకరించని అమెరికా..
న్యూయార్క్‌ టైమ్స్‌ కథనాలపై అమెరికా ఇప్పటి వరకు స్పందించలేదు. మస్క్‌గానీ, ట్రంప్‌గానీ ఎలాంటి ప్రకటన చేయాలేదు. ఇరాన్‌ కూడా ఈ కథనాన్ని ఖండించలేదు. ధ్రువీకరించలేదు. ఈ వార్త నిజమైతే మాత్రం ట్రంప్‌ ఇరాన్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ భేటీ అందుకు సంకేతమని పేర్కొంటున్నారు.

ఇరాన్‌పై దాడికి నెతన్యాహు ఆదేశాలు..
ఇదిలా ంటే.. ఇటీవలే ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఇరాన్‌పై దాడులకు ఆదేశించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింద పెరిగాయి. ఈ తరుణంలో ట్రంప్‌ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తూనే.. ఇరాన్‌తో దౌత్యానికి సిద్ధపడడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఎలాన్‌ మస్క్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ(డోజ్‌) విభాగానికి మస్క్, వివేక్‌ రామస్వామిని ట్రంప్‌ సంయుక్త సారథులుగా నియమించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular