బైక్ అమ్మినా చలానా వస్తోందా.. ఏం చేయాలంటే..?

ఈ మధ్య కాలంలో పాత బైక్ ను అమ్మి వేరే వాళ్ల పేర్లపై వాహనం రిజిస్ట్రేషన్ చేయించినా వాహనం అమ్మిన వ్యక్తి ఇంటికే ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులకు సంబంధించిన చలానాలు వస్తున్నాయి. జరిమానాను చెల్లించని పక్షంలో పోలీసులు ఛార్జిషీట్ ఫైల్ చేస్తామని చెబుతుండటం గమనార్హం. బైక్ చోరీ అయి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్న వాళ్లకు సైతం ఈ తరహా సమస్యలు ఎదురవుతూ ఉండటం గమనార్హం. నంబర్‌ ప్లేట్‌పై ఉన్న రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను వేరే వ్యక్తులు వినియోగించినా ఈ […]

Written By: Navya, Updated On : March 14, 2021 3:39 pm
Follow us on

ఈ మధ్య కాలంలో పాత బైక్ ను అమ్మి వేరే వాళ్ల పేర్లపై వాహనం రిజిస్ట్రేషన్ చేయించినా వాహనం అమ్మిన వ్యక్తి ఇంటికే ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులకు సంబంధించిన చలానాలు వస్తున్నాయి. జరిమానాను చెల్లించని పక్షంలో పోలీసులు ఛార్జిషీట్ ఫైల్ చేస్తామని చెబుతుండటం గమనార్హం. బైక్ చోరీ అయి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్న వాళ్లకు సైతం ఈ తరహా సమస్యలు ఎదురవుతూ ఉండటం గమనార్హం.

నంబర్‌ ప్లేట్‌పై ఉన్న రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను వేరే వ్యక్తులు వినియోగించినా ఈ తరహా జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో ఏ విధంగా వ్యవహరించాలో వాహనదారులకు అర్థం కావడం లేదు. ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వెంటనే ట్రాఫిక్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేయాలి. వాహనం అమ్మేసిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఆ వాహనం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే సోల్డ్‌ అవుట్‌ వెహికిల్‌ అని పోలీసులకు మెసేజ్ వస్తోంది.

అవతలి వ్యక్తి ఓనర్‌షిప్‌ రైట్స్‌ మార్చుకొని పెండింగ్ చలానాలు కడితే మాత్రమే వాహనం పొందే అవకాశం ఉంటుంది. వాహనం చోరీకి గురైతే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఎక్కడైనా ట్రాఫిక్ చలానా నమోదైతే ఆ పోలీస్ స్టేషన్ కు ఎఫ్.ఐ.ఆర్ కాపీని పంపాలి. ఆన్ లైన్ లో కూడా సులభంగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయాలనుకునే వారు https://echallan.tspolice.gov.in/ వెబ్ సైట్ లో కంప్లైంట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్లి ఫిర్యాదు చేయాలి.

ఓపెన్ అయిన వెబ్ పేజీలో ఫేక్‌ నంబర్‌ ప్లేట్‌, సోల్డ్‌ అవుట్‌ వెహికిల్‌ అనే ఆప్షన్స్ ఉంటాయి. వాహనాన్ని అమ్మి ఉంటే సోల్డ్‌ అవుట్‌ ఆప్షన్‌, మీ నంబర్‌ ప్లేట్‌ను వేరే ఎవరైనా ఉపయోగిస్తున్నట్టయితే ఫేక్‌ నంబర్‌ ప్లేట్‌ ఆప్షన్‌ ను ఎంచుకోవాలి. ఆ తరువాత వివరాలను నమోదు చేసి చలానాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.