Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బీజేపీ మధ్య బంధం తెగిపోయినట్లేనా?

కానీ నిన్న అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో అస్సలు బీజేపీ ప్రస్తావన తేకుండా తెలుగుదేశం-జనసేన కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

Written By: NARESH, Updated On : October 3, 2023 6:13 pm

Pawan Kalyan : ఆంధ్రాలో రాజకీయాలు అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్రమక్రమేణా తన ర ఆలోచనల్లో మార్పులు చేటుచేసుకుంటూ వస్తున్నారు. మొదట్లో ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పుకొచ్చాడు. అది ఒక బ్రాడ్ పాలసీ అనుకుందాం. అది ఒక బ్రాడ్ పాలసీ అనుకుందాం. తర్వాత బీజేపీ అధినాయకత్వంతో ఎన్నో సార్లు మంతనాలు జరుపుతున్నారు. టీడీపీతో కలిసి వెళితేనే వైసీపీని ఓడించగలమని పవన్ వివరిస్తూ వస్తున్నారు.

బీజేపీ వద్ద ఏం జరిగిందో తెలియదు కానీ బీజేపీ తన వెంట వస్తుందని పవన్ ఆశాభావంతో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ పొత్తును ప్రకటించారు. బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. అక్కడ కూడా బీజేపీతో సంబంధాలు తెచ్చుకోలేదు.

ఎన్డీఏ సమావేశంలో అటు పక్క పవన్.. ఇటు పక్క చిరాగ్ పాశ్వాన్ నిలుచొని ఇద్దరు యువ నాయకులకు బీజేపీ పెద్దపీట వేసింది. వీళ్లద్దరూ ఎమర్జైన నాయకులు అంటూ బీజేపీ ఫోకస్ చేసింది. మరి బీజేపీ విషయంలో అప్పటికీ ఆశాభావంతోనే పవన్ ఉన్నారు.

కానీ నిన్న అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో అస్సలు బీజేపీ ప్రస్తావన తేకుండా తెలుగుదేశం-జనసేన కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

పవన్ కళ్యాణ్ బీజేపీ మధ్య బంధం తెగిపోయినట్లేనా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.