Uday Kiran: తెలుగు తెర పై ‘ఉదయ్ కిరణ్’ ముద్ర నేటికి చెదిరిపోలేదు. చాలామంది హీరోలకు అందం ఉంటుంది. కానీ, అందానికి పర్యాయపదం అంటే ఆ తరంలో శోభన్‌బాబు, ఈ తరంలో ‘ఉదయ్ కిరణే అనే స్థాయిలో ఉదయ్ పేరు తెచ్చుకున్నాడు. దాంతో లేడీస్ లో తిరుగులేని ఫాలోయింగ్ దక్కింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సంచలనాలు సృష్టించాడనే పాజిటివ్ ఫీలింగ్ కూడా ఉదయ్ పై ప్రేక్షకుల్లో బలంగా కలిగింది.

ఈ లోపు ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ విజయాలు ఇచ్చాడు. ఇక తిరుగులేదు అనుకున్నారు. కానీ, అంతలోనే అతన్ని కాలం కాటేసింది, జాతకం తిరగబడింది. వ్యక్తిగత జీవితంలో జరిగిన చిన్న సంఘటన కారణంగా ఉదయ్ కిరణ్ కెరీర్ పూర్తిగా తలకిందులు అయ్యింది. అవకాశాలు ఇచ్చే స్థాయి నుంచి.. అవకాశాల కోసం కష్టపడే స్థాయికి పడిపోయాడు. చివరకు చనిపోయే వరకు కూడా కోలుకోలేకపోయాడు.
Also Read: Dil Raju: ఆ విషయంలో దిల్ రాజు నెగ్గాడు.. ఎప్పుడు? ఎక్కడంటే ?
అయితే, అసలు ఉదయ్ కిరణ్ చావుకి కారణం ఏమిటి ? అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ?, ఆత్మహత్య చేసుకునే ముందు ఉదయ్ కిరణ్ ఎవరిని కలుసుకున్నాడు ?, ఇంతకీ ఉదయ్ కిరణ్ తో సన్నిహితంగా ఉండే సినిమా వాళ్ళు ఎవరు ?, అనే అంశాలు నేటికి వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ నటి సుధ, ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు తన దగ్గరకు వచ్చి, తన కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడని కీలక వ్యాఖ్యలు చేసింది.

అప్పటికే ఉదయ్ కిరణ్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఆ సమయంలో ఉదయ్, నటి సుధ దగ్గరకు వెళ్ళాడు. ఉదయ్ కిరణ్ కి ఆమె చాలా సినిమాల్లో తల్లిగా నటించింది. అందుకే వారి మధ్య తల్లి కొడుకుల అనుబంధం ఉంది. ఉదయ్ కిరణ్‌ను ఆమె దత్తత కూడా తీసుకోవాలనుకున్నారు. ఐతే, సుధ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి చెప్పారు.
సుధ మాట్లాడుతూ.. ‘ఉదయ్ కిరణ్ చాలా మానసిక వేదనకు గురయ్యాడు. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి రెండు నెలల ముందు తనను నేను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ, కొన్ని కారణాల వల్ల అది వాస్తవ రూపం దాల్చలేదు. ఆ తర్వాత ఓ రోజు ఉదయ్ కిరణ్ నా దగ్గరకు వచ్చి నా కాళ్లు గట్టిగా పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను ఓదార్చే ప్రయత్నం చేయగా.. నేను ఒంటరినై పోతున్నాను అమ్మా.. అని ఏడ్చాడు.

కానీ నేను తనకు ధైర్యం చెప్పాను. ‘ఏం కాదు నాన్నా… నేను నీకు బిజినెస్ పెట్టిస్తాను. నువ్వు సంతోషంగా ఉంటావు’ అని చెప్పాను. కానీ.. తను నా మాట వినలేదు. ఉదయ్ కిరణ్ విషిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో వీళ్ళ సంసార జీవితం బాగానే ఉంది. ఆ తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉదయ్ కిరణ్ అనుభవించాల్సి వచ్చింది. సంసార జీవితంలోనూ గొడవలు జరిగేవి. ఇవన్నీ చూసి ఉదయ్ ఎంతో ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుని ఉంటాడు’ అంటూ సుధ ఎమోషనలైయ్యారు.
[…] […]