https://oktelugu.com/

Roja : కూతురు చేసిన పనికి మంత్రి రోజా షాకైందట.!

Roja : తెలుగు తెరపై నవ్వుల రోజా ఆమె.. ఇప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. రీసెంట్ గా మంత్రి కూడా అయ్యింది. ఇలా అదృష్టం తలుపుతట్టి రోజా అందలమెక్కింది.అయితే రోజానే కాదు.. ఆమె కూతురు కూడా ఇప్పుడు అరుదైన ఖ్యాతి గడిచింది. ప్రముఖ నటి, ఏపీ మంత్రి కూడా అయిన రోజాకు మరో ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆమె కూతురు.ఇది విని రోజా షాక్ అయ్యిందట.. రోజా కుమార్తె అన్షు మాలిక మరో ఘనత సాధించింది. రోజా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 12, 2022 / 02:11 PM IST
    Follow us on

    Roja : తెలుగు తెరపై నవ్వుల రోజా ఆమె.. ఇప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. రీసెంట్ గా మంత్రి కూడా అయ్యింది. ఇలా అదృష్టం తలుపుతట్టి రోజా అందలమెక్కింది.అయితే రోజానే కాదు.. ఆమె కూతురు కూడా ఇప్పుడు అరుదైన ఖ్యాతి గడిచింది.

    ప్రముఖ నటి, ఏపీ మంత్రి కూడా అయిన రోజాకు మరో ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆమె కూతురు.ఇది విని రోజా షాక్ అయ్యిందట.. రోజా కుమార్తె అన్షు మాలిక మరో ఘనత సాధించింది. రోజా ఎంత పాపులర్ నో ఆమె కూతురు అన్షు మాలిక కూడా అంతే పాపులారిటీ సంపాదించుకున్నారు.

    తల్లి రాజకీయాల్లో నటిస్తుంటే ఆమె కూతురు అన్షు అందరిలో రాజకీయాలు లేదా సినిమాల బాట పట్టకుండా నచ్చిన పనులు చేసుకుంటూ అందులో రాణిస్తూ పదవి మంది చేత శభాష్ అనిపించుకుంటోంది. తల్లిలా సేవా కార్యక్రమాలు సైతం చేస్తూ అందరి మనసు గెలుస్తోంది. రోజాను అవాక్కయ్యేలా చేస్తోంది.

    అన్షు అది చిన్న వయసులోనే వెబ్ డెవలపర్ గా.. కంటెంట్ క్రియేటర్ గా రైటర్ గా ప్రముఖంగా ఎదిగారు. ఈ తరం పిల్లలకు ఆదర్శంగా నిలిచారు. ఇటీవల ఐదుగురు పిల్లలను దత్తత తీసుకొని స్ఫూర్తిని పంచారు.

    ఇక రైటర్ అయిన అన్షు తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అన్షు రాసిన ఓ పుస్తకానికి అవార్డు దక్కడం విశేషం. జిటౌన్ మ్యాగజైన్ సౌత్ ఇండియా నుంచి ‘బెస్ట్ ఆథర్’గా అన్షు ఎంపికైంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ నటి షాజాన్ పదామ్ని చేతులమీదుగా అన్షు ఈ అవార్డు అందుకుంది. రచయిత్రిగా గుర్తింపు పొందింది. అతిచిన్న వయసులోనే రైటర్ గా ఏకంగా అన్షు అవార్డు పొందడంపై రోజా షాక్ అయ్యింది. కూతురిపై ప్రశంసలు కురిపించిందట..

    ఇదివరకూ అన్షు రచనలు ‘బర్న్ అచీవర్’ మ్యాగజన్ లో కూడా ప్రచురించారు. ఓ కథకు ‘క్వీన్ ఆఫ్ టాలెంట్’ అంటూ కీర్తించారు. ఇప్పుడు ఏకంగా ఈమె అవార్డు దక్కించుకోవడం సంచలనమైంది.