https://oktelugu.com/

Dil Raju: ఆ విషయంలో దిల్ రాజు నెగ్గాడు.. ఎప్పుడు? ఎక్కడంటే ?

Dil Raju: ‘F3’ సినిమాకి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. గత 40 రోజులకు పైగా థియేటర్లలో మంచి వసూళ్లను సాధించింది. 2022లో విడుదలైన సినిమాల్లో క్లీన్ హిట్‌గా నిలిచింది. కాగా ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి కూడా రానుంది. మరి ఎప్పుడు? ఎక్కడ ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందో తెలుసా ?. ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. జూలై 22వ తేదీ నుంచి ప్రేక్షకులు ఈ […]

Written By:
  • Shiva
  • , Updated On : July 12, 2022 / 01:51 PM IST
    Follow us on

    Dil Raju: ‘F3’ సినిమాకి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. గత 40 రోజులకు పైగా థియేటర్లలో మంచి వసూళ్లను సాధించింది. 2022లో విడుదలైన సినిమాల్లో క్లీన్ హిట్‌గా నిలిచింది. కాగా ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి కూడా రానుంది. మరి ఎప్పుడు? ఎక్కడ ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందో తెలుసా ?. ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. జూలై 22వ తేదీ నుంచి ప్రేక్షకులు ఈ సినిమాని ఓటీటీలో హ్యాపీగా చూడొచ్చు.

    Dil Raju

    వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 78.40 కోట్లు రాబట్టింది. ఈ రేంజ్ కలెక్షన్స్ కలెక్ట్ చేయడం నిజంగా విశేషమే. అయితే, ‘ఎఫ్ 2’కి రూ. 80 కోట్లకు పైగా షేర్ వచ్చింది. అదే గ్రాస్ పరంగా అయితే 130 కోట్లు వచ్చాయి. కానీ ‘ఎఫ్ 3’కి ఆ స్థాయి కలెక్షన్స్ రాలేదు. బడ్జెట్ మాత్రం ‘ఎఫ్ 2’ కంటే.. ‘ఎఫ్ 3’కి డబుల్ అయ్యింది. ఈ లెక్కన ‘ఎఫ్ 3’ రెట్టింపు కలెక్షన్స్ రాబట్టాలి. కానీ ఆ స్థాయిలో రాబట్టలేదు.

    Also Read: Ghost First Poster On The Occasion Of Shivraj Kumar Birthday: కింగ్ అఫ్ అల్ మాసెస్ శివరాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఘోస్ట్ ఫస్ట్ పోస్టర్ విడుదల

    అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ 64.50 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఆ కలెక్షన్స్ ను రాబట్టి హిట్ అయ్యింది. మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. పక్కా కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సరదగా సాగుతూ బాగానే ఎంటర్టైన్ చేస్తోంది.

    కానీ, గ్రిప్పింగ్ నరేషన్ లేకపోవడం, కథలో సహజత్వం మిస్ అవ్వడం సినిమాకి మైనస్ అయ్యింది. అయితే, ప్రేక్షకులకు ఈ సినిమాలో కామెడీ బాగా నచ్చుతుంది. త్వరలోనే సోని లివ్ లో ఈ చిత్రాన్ని తప్పకుండా చూడొచ్చు. అనిల్ రావిపూడి తన డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అండ్ క్యారెక్టరైజేషన్స్ తో మెప్పించాడు. అలాగే క్వాలిటీ ఫన్ తో ఫుల్ గా నవ్వించాడు.

    Dil Raju

    ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాల్లో వచ్చే సీన్స్ లో అయితే, అద్భుతమైన కామెడీ టైమింగ్ తో బాగా ఎంటర్ టైన్ చేశాడు. అలాగే, ఫస్ట్ హాఫ్ లో వచ్చే వెంకీ -వరుణ్ ల లోపాలను కూడా చాలా ఫన్నీగా ఎలివేట్ చేశాడు. కాబట్టి.. ఓటీటీ లో కూడా ఎఫ్ 3 సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. అందుకే.. సోని లివ్ ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇక దిల్ రాజు ఈ చిత్రాన్ని 50 రోజుల లోపు ఓటీటీ లో రిలీజ్ చేస్తా అని రిలీజ్ కి ముందే చెప్పాడు. ఈ విషయంలో బయ్యర్లు అడ్డు పడినా దిల్ రాజు మాటతప్పని.. మడమ తిప్పని వ్యక్తిగా నిలిచాడు.

    Also Read:Bithiri Sathi Remuneration: సినిమా ఇంటర్వ్యూలకు బిత్తిరి సత్తి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా? ..షాకింగ్ రెమ్యూనరేషన్?

    Tags