Pawan Kalyan Bro Movie: ఆ విషయం అంతే భయం ఉన్నవాళ్లు.. తప్పక చూడాల్సిన సినిమా ‘బ్రో’

పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెపుతారు…పుట్టుక మలుపు.. మరణం గెలుపు అని.. ఆ ఒక్క లైన్ లో ఈ సినిమా కథ అంతా ఉంది. మొదటినుంచి ఈ చిత్రంలో హీరో తాను లేకపోతే తన ఫ్యామిలీ ఏమైపోతారో అనే భయం లో ఉంటారు.

Written By: Swathi, Updated On : August 1, 2023 8:48 am

Pawan Kalyan Bro Movie

Follow us on

Pawan Kalyan Bro Movie: ఏ మనిషికైనా చావంటే ఎందుకు భయం ఉండదు బ్రో. ప్రతి ఒక్కరూ అన్నిటికన్నా ఎక్కువ భయపడేది ఏది అంటే అది చావే.‌ కొంతమంది వారిపై వారికి ప్రేమ ఉండడం వల్ల మరణం అంటే భయపడుతూ ఉంటే.. మరి కొంతమంది మాత్రం తాము లేకపోతే తమ ఫ్యామిలీ ఏమైతుంది అనే భయం లో చావు గురించి భయపడుతూ ఉంటారు.

అయితే బ్రో సినిమా చూస్తే మాత్రం ఈ భయం మనలో చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా రెండో రకం మనుషులకు అంటే తాము లేకపోతే తన ఫ్యామిలీ ఏమైతుంది అనే భయం ఉన్నవారికి ఇది తప్పక చూడవలసిన సినిమా.

భలే చెబుతావులే బ్రో సినిమా చూస్తే అంత మార్పు వచ్చేస్తుందా మనలో అని అడగొచ్చు. మారకూడదు అని గట్టిగా ఫిక్స్ అయిన వారిని ఏమీ చేయలేము కానీ, మారాలి అన్న ఆలోచన ఉన్నవారికి మాత్రం పెద్దలు చెప్పే మాటలే కాదు ఇలాంటి సినిమాలు, సినిమాలోని మాటలు కూడా ప్రోత్సాహం ఇస్తాయి.

ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెపుతారు…పుట్టుక మలుపు.. మరణం గెలుపు అని.. ఆ ఒక్క లైన్ లో ఈ సినిమా కథ అంతా ఉంది. మొదటినుంచి ఈ చిత్రంలో హీరో తాను లేకపోతే తన ఫ్యామిలీ ఏమైపోతారో అనే భయం లో ఉంటారు. నిజంగానే చిన్నప్పుడు నుంచి తన ఫ్యామిలీ బాధ్యతా అంతా తానే చూసుకుంటూ ఉంటాడు. అందుకే తాను లేకపోతే అసలు ఆ ఫ్యామిలీ ఏమైపోతుందో అని తాపత్రేయ పడిపోతూ తన జీవితం తాను బతకకుండ, తన ఫ్యామిలీ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు ఈ హీరో.

మనలో చాలామంది ఇలానే బతుకుతూ ఉంటాం.. మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ.. వారికి ఏమవుతుందో అనే భయంతో అలానే మనకి ఏమన్నా అయితే వారి పరిస్థితి ఏమవుతుందో అనే బాధతో…ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం.

దానికి తోడు ఏదో చేసేయాలని కూడా తాపత్రెయ పడుతూ ఉంటాం. ఏమన్నా అయిపోతుంది ఏమో అనే ఆలోచనలో బతుకుతూ ఉంటాం. ఈ ఆలోచనలన్నీ వృధా, ఈ నిమిషం ఏమి చేస్తున్నాం,‌ ఎవరికి సహాయపడుతున్నాం అనేది మాత్రమే ముఖ్యమని ఈ సినిమా తెలుపుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే కరోనా టైం లో అందరూ తమ ఫ్యామిలీకి ఏమైపోతుందో అని ఇంట్లో ఉన్న ముసలివారికి విపరీతమైన కండిషన్ లు పెట్టారు. కరోనా భయంతో వారు సరిగ్గా బ్రతకలేకపోయారు అలానే ఆ కండిషన్ లతో ముసలివారు కూడా ఎన్నో బాధలు పడ్డారు. అయితే ఇవన్నీ ఒకరితో ఒకరు కూర్చొని ఒకరితో మరొకరు భయాలను పంచుకోకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులే.

నా ఫ్యామిలీ, నేను హ్యాపీగా ఉండాలి అనుకునే మనలో ఎంతమంది నిజంగా బతికున్నప్పుడు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నామో చెప్పండి. కెరియర్ లో ఎదగాలి అనుకోవడం మంచిదే కానీ కెరియర్ లో మనం ఎదిగే దారిలో ఎంతవరకు మన ఫ్యామిలీని ఆనందంగా ఉంచగలుగుతున్నాం. ఈ ప్రశ్న మనకు మనం వేసుకుంటే తప్పకుండా మనం బ్రతికే జీవితం మన వల్లే వృధా అయిపోతోంది అని మనకు అర్థమవుతుంది. ఈ సినిమా కరెక్ట్ గా చూస్తే ఈ చిత్రం లో హీరో తన ఫ్యామిలీ కోసం ఎన్నో చేసిన తన ఫ్యామిలీ కి తనతో మాట్లాడే సమయం కూడా కేటాయించకపోవడం వల్ల వాళ్ళ ఇష్ట ఇష్టాలు అసలు తెలుసుకోలేక పోతారు. అలా అని బాధ్యత లేకుండా తిరగాలా అని కాదు. బాధ్యత ఉండాలి, కానీ మనకంటూ మనం టైం కూడా కేటాయించుకోవాలి అలానే మన ఫ్యామిలీకి కూడా.

ఇందులో ఒక సీన్ ఉంది.. హీరో తన భార్యకు కడుపు వస్తే తాను మెటర్నిటీ లీవ్ పెట్టారు అని. ఆ డైలాగ్ సరిగ్గా ఆలోచిస్తే నిజంగానే ఈ సినిమాలో హీరో కన్నా కూడా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ లో గొప్పతనం ఉంది అని అందుకే హీరో కన్నా కూడా ఆయన పెద్ద పొజిషన్ కి చేరారు అని అర్థమవుతుంది. జరిగేది జరగక మానదు. దానికోసం మనం ఏదో చేసేయాలని ఏదో భయాలు పడుతూ బతుకుతూ ఉంటే ఈరోజు మనకు నరకం అవుతుంది.

అన్నిటికన్నా ముఖ్యంగా చావు వచ్చినప్పుడు మనం ఉండం, మనం ఉండగా అది రాదు.. కాబట్టి దాని గురించి ఆలోచించడం భయపడడం మానేసి ప్రస్తుత రోజుని హ్యాపీగా గడపాలి. అందుకే ఈ సినిమాలో చెప్పినట్టు ‘మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో…మళ్లీ పుట్టి భూమి మీదకి తిరిగి రావు నిజం తెలుసుకో..’ అంటూ లైఫ్ ని ఎంజాయ్ చేయడం మంచిది.

ఇదే విషయాన్ని బ్రో సినిమాతో తమదైన స్టైల్ లో దర్శకుడు సముద్రఖని అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పవర్ ఫుల్ గా తెరకెక్కించారు. ముఖ్యంగా లాస్ట్ సీన్లు హీరో పుట్టినప్పుడు స్నానం చేయిస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు అంత తేలికగా ఉండి అంటారు. అలానే ఒక సీన్ లో హీరో అమ్మ ..భార్య, అమ్మ, అత్తా, కోడలు అని అవ్వగలిగాను కానీ నేను అనుకున్నది మాత్రం అవ్వలేకపోయాను అంటుంది…ఇలా ఎన్నో మంచి డైలాగులతో ఈ సినిమాని తమదైన స్టైల్ లో తీశారు..సముద్రఖని, త్రివిక్రమ్. అందుకే ప్రస్తుతం జనరేషన్ వారు తప్పక చూడాల్సిన సినిమా ‘బ్రో’.