ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ : భారత్ సెమీస్ ప్రత్యర్థి తేలిపోయింది.. పాకిస్తాన్ కు టఫ్ ఛాన్స్

న్యూజిలాండ్ టీం ఆల్ మోస్ట్ సెమి ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప పాకిస్తాన్ సెమీఫైనల్ రాలేదు ఇంకా దీంతో సెమీఫైనల్ రేస్ లో మొదటి నుంచి వస్తున్న సస్పెన్స్ కి తెరపడింది..

Written By: NARESH, Updated On : November 9, 2023 9:07 pm
Follow us on

ODI World Cup 2023 : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా 2023 వరల్డ్ కప్ జరుగుతుంది.అందులో భాగంగా ప్రస్తుతం ఇండియన్ టీం వరుసగా 8 విజయాలను అందుకొని పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక ఇదే క్రమంలో ఇండియన్ టీం తో సెమీ ఫైనల్ లో తలబడే జట్టు ఏది అనేది దాని మీద ఇప్పటివరకు సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది.ఇక ఇలాంటి క్రమంలో ఇవాళ్ల న్యూజిలాండ్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక టీం మీద న్యూజిలాండ్ ఘన విజయాన్ని సాధించింది. దీంతో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుందా లేదా అనేది ఒకసారి మనం తెలుసుకుందాం..

గత కొద్ది రోజులు గా నెంబర్ 4 లో సెమీఫైనల్ కి చేరుకునే జట్టు ఏది అనే దానిమీద కీలకమైన చర్చ జరుగుతుంది. ఇక ఇవాళ్ళ ఆడిన న్యూజిలాండ్ , శ్రీలంక మ్యాచ్ ని ఒకసారి చూసుకున్నట్లయితే మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 171 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇక కుషల్ పెరారా ఒక్కడే 51 పరుగులు చేసి ఆ టీమ్ గౌరవ ప్రదమైన స్కోర్ చేయడం లో కీలక పాత్ర వహించాడు.ఇక ఇలాంటి క్రమంలో న్యూజిలాండ్ బౌలర్లు వాళ్ల స్థాయి మేరకు రాణించి డూ ఆర్ డై మ్యాచ్ లో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశారు.

నిజానికి ఈ మ్యాచ్ ముందు వర్షం ఉంది, న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో భారీ విజయం సాధిస్తే తప్ప సెమీస్ కి క్వాలిఫై అవ్వదు అంటూ చాలా రకాల డౌట్లు వచ్చాయి.కానీ పీక్ సిచువేషన్ వచ్చినప్పుడు న్యూజిలాండ్ టీం పవర్ ఏంటో ఈరోజు మ్యాచ్ లో చూపించారు. ముఖ్యంగా న్యూజిలాండ్ బౌలర్లు అయితే అత్యుత్తమ ప్రదర్శనని కనబరిచి శ్రీలంక టీం భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. ముఖ్యంగా బౌల్ట్ మూడు వికెట్లు తీసి శ్రీలంక టీం భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు.సంట్నార్, రచన్ రవీంద్ర , ఫెర్గుసన్ తలో రెండు వికెట్లు తీశారు.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీం మొదట్లో ఓపెనర్లు ఆ టీమ్ కి శుభా రంబాన్ని ఇచ్చారు.ఇక ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్ ప్లేయర్లు అయిన డేవిన్ కాన్వే, రచన్ రవీంద్ర ఇద్దరూ కూడా చాలా అత్యుత్తమమైన బ్యాటింగ్ చేశారనే చెప్పాలి. మొదటి వికెట్ 86 పరుగుల పాత్నార్షిప్ నెలకొల్పారు. ఇక ఇందులో మొత్తం కొట్టాల్సిన స్కోర్ లో సగం స్కోర్ వీళ్లే కొట్టారు. ఇక ఈ క్రమంగా 23వ ఓవర్ రెండవ బాల్ మ్యాచ్ ని ముగించేశారు. కాబట్టి 25 ఓవర్ల లోపే న్యూజిలాండ్ టీం ఈ విజయాన్ని దక్కించుకుంది కాబట్టి సెమీఫైనల్ కి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇక ఇంగ్లాండ్ తో పాకిస్తాన్ ఆడబోయే మ్యాచ్ లో పాకిస్తాన్ 274 పరుగుల భారీ లక్ష్యంతో గెలిస్తేనే పాకిస్తాన్ టీం సెమీఫైనల్ కు చేరుకుంటుంది.లేకపోతే పాకిస్తాన్ సెమీఫైనల్ సెమీఫైనల్ ఆశలు ఆవిరి అయి పోయినట్టే.. న్యూజిలాండ్ టీం ఆల్ మోస్ట్ సెమి ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప పాకిస్తాన్ సెమీఫైనల్ రాలేదు ఇంకా దీంతో సెమీఫైనల్ రేస్ లో మొదటి నుంచి వస్తున్న సస్పెన్స్ కి తెరపడింది..