India Semiconductor Chip : చిప్ తయారీ పరిశ్రమలో భారత్ ఎక్కడుంది? వేదాంత-ఫాక్స్ కాన్ ఇండస్ట్రీ రాకతో చిప్ హబ్ గా భారత్ మారనుందా? ఈ భారీ పరిశ్రమతో భారత్ కు ఎంత లాభం? అన్న దానిపై విశ్లేషిద్దాం.
భారత్ ప్రభుత్వం ‘ఇండియా సెమీ కండక్టర్ మిషన్’ను 2021లో మోడీ సర్కార్ ప్రారంభించింది. సెమీ కండక్టర్ పరిశ్రమను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. చాలా మంది శాస్త్రవేత్తలు, ఎక్స్ పర్ట్స్ తో కమిటీ వేశారు. ఐటీ శాఖ మంత్రి దీనికి నేతృత్వం వహిస్తున్నారు. 76వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. అయినా ఏ పరిశ్రమ భారత్ కు రాలేదు. దీంతో ఆ స్కీంను మార్చారు. ఎక్కువ మంది పరిశ్రమలు వచ్చేలా మార్పులు చేశారు.
ప్రాజెక్ట్ కాస్ట్ లో 50శాతం తాము భరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదో పెద్ద ఇండస్ట్రీ అని తెలిసి మోడీ సర్కార్ ఈ ప్లాన్ చేసింది. డిజైన్ మేకింగ్ కూడా ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఇది కాక.. మొహ్రాలీని సెమీ కండక్టర్ ఆధునికరణ చేశారు.
60వ దశకంలో మొదలైన ఈ ఇండస్ట్రీ భారత్ కు రావడానికి 6 దశాబ్ధాలు పట్టిందంటే మనం ఎంత వెనుకబాటు ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ ‘చిప్’ తయారీ పటంలో భారత్ ఎక్కడ? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.