Prabhas Nitya Menon : అందాల ఆరబోతలకు దూరంగా కేవలం నటనకి ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్ నిత్యామీనన్..’అలా మొదలైంది’ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ కేరళ కుట్టి కి ఇక్కడ కుర్రకారులో క్రేజ్ ఎక్కువే..ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా, ఎంత పెద్ద స్టార్ హీరో సరసన నటించే అవకాశం వచ్చినా మనసుకి నచ్చని పనిని ఈమె అసలు చెయ్యదు..అయితే అందరి హీరోయిన్స్ లాగానే ఈమకే అభిమానులతో పాటు దురాభిమానులు కూడా ఉన్నారు..ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో ఈమె చేసిన కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ కి ప్రభాస్ అభిమానుల నుండి ఘోరమైన నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.

చిన్నప్పటి నుండి కేరళలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయికి టాలీవుడ్ గురించి అంతంత మాత్రమే తెలుసు..ఇక్కడి స్టార్ హీరోలు కూడా ఈమెకి వచ్చిన కొత్తల్లో తెలిసేది కాదు..ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునే ఈమెకి మిగిలిన స్టార్ హీరోలు తెలియకపోవడం ఏమిటి అని చాలా మందిలో మెలిగే ప్రశ్న.
ఇటీవల ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో దీని గురించి మాట్లాడుతూ ‘నేను ఇక్కడ అలా మొదలైంది అనే సినిమా చేస్తున్న సమయం లో నాకు ఇక్కడి హీరోలెవరు కూడా తెలియదు..ప్రభాస్ గురించి నన్ను అప్పట్లో అడిగినప్పుడు..ఆయనెవరో నాకు తెలియదు..నేను అతని సినిమాలు చూడలేదు అన్నాను..దీనికి అప్పట్లో చాలా రచ్చ చేసారు..నాకు తెలియదు అనే విషయాన్నీ తెలియదనే చెప్తాను..అవకాశాల కోసం ఇష్టమొచ్చినట్టు అందరిలా నేను మాట్లాడలేను..నేను మలయాళం ఇండస్ట్రీ లో ఉన్నప్పుడు నాకు తెలిసిన తెలుగు హీరోలు చిరంజీవి, అల్లు అర్జున్ , నాగార్జున మరియు వెంకటేష్ మాత్రమే’ అని చెప్పుకొచ్చింది నిత్యామీనన్.
ఇక నిత్యామీనన్ ఈమధ్య చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి..ఏడాది ప్రారంభం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా తొలి హిట్ ని అందుకున్న నిత్యామీనన్..రీసెంట్ గా తమిళ హీరో ధనుష్ తో చేసిన ‘తిరు’ అనే చిత్రం ద్వారా మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది..ప్రస్తుతం ఆమె చేతిలో మలయాళం లో రెండు సినిమాలు..తమిళం లో ఒక సినిమా తో పాటు పలు టీవీ షోస్ కి జడ్జి గా కూడా వ్యవహరిస్తోంది.