సాధారణంగా గోరింటాకు అంటే మగువలు ఎంతో ఇష్టపడతారు. చేతికి గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతికి అందం రెట్టింపు అవుతుంది.అదేవిధంగా మన చేతిలో గోరింటాకు ఎర్రగా పండటం వల్ల మంచి భర్త దొరుకుతాడు అని చెబుతుంటారు. కానీ శుక్రవారం మన చేతికి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. శుక్రవారం పూట అమ్మాయిలు గోరింటాకు పెట్టుకోవడం ఒక శుభసూచకమని తెలియజేస్తున్నారు.
Also Read: గురువారం తెల్లని వస్తువులను దానం చేస్తే…!
గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఎరుపుగా పండటాన్ని ఆ సూర్యభగవానుడికి ప్రతీకగా తెలియజేస్తారు.అందుకే గోరింటాకు పెట్టుకునే సమయంలో ముందుగా అరచేతిలో సూర్యునివలె గుండ్రని ఆకారాన్ని పోలి పెట్టుకుంటారు. ఈ విధంగా గోరింటాకు ఎర్రగా పండటం వల్ల జ్ఞాన కాంతిని గోరింటాకు ద్వారా మేల్కొల్పడంగా భావిస్తారు. అందుకోసమే అమ్మాయిలు తరచూ గోరింటాకు పెట్టుకోవడం మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.
Also Read: వివిధ రకాల బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసా..?
శాస్త్రీయ పరంగా చూస్తే గోరింటాకు ముఖ్యంగా గర్భవతులు పెట్టుకోవడం వల్ల గర్భాశయానికి రక్తాన్ని సరఫరా చేసే నాడులు ఉంటాయి. ఆనాడులు గర్భవతులు శరీరంలోని అధిక వేడిని బయటకు లాగేస్తుంది.అందుకోసమే ప్రసవం జరిగిన తర్వాత గోరింటాకును చిన్న ముద్దగా నూరి బాలింతల చేత మింగిస్తే గర్భాశయంలో ఎటువంటి సమస్యలు ఏర్పడిన నయమవుతాయని భావిస్తారు. అదేవిధంగా స్త్రీల గోరింటాకు చేతికి పెట్టుకున్నప్పుడు అది ఎంత ఎర్రగా పండితే వారి ఆరోగ్యం అంత అందంగా ఉంటుందని భావిస్తారు.కేవలం ఆరోగ్య పరంగా మాత్రమే కాకుండా అందంగా కూడా ఈ గోరింటాకు ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం