https://oktelugu.com/

సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న పాల ధరలు..?

దేశంలో రోజురోజుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారీగా ధరలు పెరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సామాన్యులకు మరో భారీ షాక్ తగలనుంది. దేశంలో పాల ధరలు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాంకు చెందిన పాల ఉత్పత్తిదారులు పాల ధరలను భారీగా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. లీటర్ పాలపై ఏకంగా 12 రూపాయలు పెంచనున్నారు. Also Read: సామాన్యులపై అదనపు భారం.. భారీగా పెరిగిన గ్యాస్ […]

Written By: Kusuma Aggunna, Updated On : February 26, 2021 12:21 pm
Follow us on

Milk Prices Increases

దేశంలో రోజురోజుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారీగా ధరలు పెరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సామాన్యులకు మరో భారీ షాక్ తగలనుంది. దేశంలో పాల ధరలు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాంకు చెందిన పాల ఉత్పత్తిదారులు పాల ధరలను భారీగా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. లీటర్ పాలపై ఏకంగా 12 రూపాయలు పెంచనున్నారు.

Also Read: సామాన్యులపై అదనపు భారం.. భారీగా పెరిగిన గ్యాస్ ధరలు..?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం కూడా పాల ధరలు పెరగడానికి ఒక కారణమని తెలుస్తోంది. 25 గ్రామాలకు చెందిన పాల ఉత్పత్తిదారులు సమావేశమై పాల ధరల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం రెండు రూపాయలు ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నా కుదరలేదని అందువల్లే ఈ సంవత్సరం పాల ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని పాల ఉత్పత్తిదారులు అన్నారు. పశు దాణా ధరలు కూడా భారీగా పెరిగాయని పాల ఉత్పత్తిదారులు చెప్పుకొచ్చారు.

Also Read: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకుంటే కలిగే లాభనష్టాలు ఇవే..?

ప్రస్తుతం రత్లాంలో లీటర్ పాల ధర 43 రూపాయలుగా ఉండగా పాల ధరను 55 రూపాయలకు పెరిగింది. పాల విక్రయదారులతో ఈ మేరకు చర్చలు జరుపుతుండగా పాల ధరలకు సంబంధించి తుది ప్రకటన వెలువడాల్సి ఉంది. పాల ధరలు పెరిగితే సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సామాన్యులకు సైతం పాల ధరలు పెరగడం వల్ల బతుకు బండి భారంగా మారుతుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరలు సైతం సామాన్య ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మార్కెట్ లో కిలో ఉల్లి 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పలుకుతుండటం గమనార్హం.