దేశంలో పట్టాపగ్గాలు లేకుండా విస్తృతమవుతున్న సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. గురువారం మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు జారీ చేసింది.
Also Read: రూట్ విజృంభణ.. కుప్పకూలిన ఇండియా.. ఇంగ్లండ్ సైతం 19-3
డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ తో కూడిన సరికొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021 ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలతో సోషల్ మీడియా సాధనాలైన వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ కు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.
కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ దాని పర్యవసనాలపై దేశవ్యాప్తంగా ఇప్పుడే తీవ్రమైన చర్చ జరుగుతోంది.
ఇక నుంచి ఒక వివాదాస్పద సందేశం ఎవరిద్వారా వచ్చింది అనేది తెలుసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనల వల్ల వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఎండ్ టు ఎండ్ ఎన్ స్క్రిప్షన్ ఉపయోగించే మెసేజింగ్ యాప్స్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు పాటించాలంటే వాటి సెక్యూరిటీ విధానాలను అవే ఉల్లంఘించాల్సి ఉంటుంది.
Also Read: నాడు ఎన్టీఆర్.. నేడు విష్ణువర్ధన్ రెడ్డి..
ఈ నేపథ్యంలో కేంద్రం నిబంధనలు అవి పాటిస్తాయా? లేదా కేంద్రం ఆగ్రహానికి బలవుతాయా? అనేది ఆసక్తిగా మారింది. ఇదే అంశంపై దేశవ్యాప్తంగా ఎలాంటి చర్చ జరుగుతుందో వేచిచూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్