
దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా ప్రజలకు రకరకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ యాప్స్ లో కొన్ని యాప్స్ సురక్షితం కాగా మరికొన్ని యాప్స్ మాత్రం సమస్యలను సృష్టిస్తాయనే చెప్పాలి. మనలో చాలామంది యాప్ గురించి సరైన అవగాహన లేకుండా వాటిని డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని యాప్స్ ను మొబైల్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ స్టాల్ చేసుకోకూడదు.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఇకపై అన్ని ఉద్యోగాలకు ఒకటే పరీక్ష..?
కొన్ని యాప్స్ మొబైల్ లోని బ్యాంకు ఖాతా వివరాలు, పాస్ వర్డ్స్, ఆధార్, పాన్ నెంబర్స్ ఇతర వివరాలను సేకరించి సైబర్ మోసగాళ్లకు అందించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తరచూ డిజిటల్ పేమెంట్ యాప్స్ సహాయంతో పేమెంట్లు చేసేవాళ్లు యాప్స్ వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నిపుణులు గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న కొన్ని యాప్స్ ప్రమాదకరం అని చెబుతున్నారు.
Also Read: ప్రజలకు ఫ్రీగా వాషింగ్ మెషీన్, కేబుల్ టీవీ.. ఎక్కడంటే..?
ఇప్పటికే స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ యాప్స్ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే అన్ ఇన్ స్టాల్ చేయాలని సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకున్న వాళ్లు అన్ ఇన్ స్టాల్ చేయడంతో బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన పిన్, పాస్ వర్డ్ లను మారిస్తే మంచిది. cake vpn, pacific vpn, evpn, beatplayer, qr/barcode scanner max, music player, tooltipnatorlibrary, qrecorder యాప్స్ మీ మొబైల్ లో ఉంటే వెంటనే డిలేట్ చేస్తే మంచిది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
యాప్స్ వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాంక్ ఖాతాలోని డబ్బులు ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే సమయంలో రివ్యూలను, రేటింగ్ లను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇబ్బందుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.