
సాధారణంగా కొంతమంది ఏ పని చేసినా ఆ పనిలో విజయం సాధిస్తూ ఉంటారు. కొందరికి సక్సెస్, డబ్బు కష్టపడటం వల్ల వస్తే మరి కొందరికి కష్టపడకపోయినా అదృష్టం వల్ల సక్సెస్, డబ్బు వస్తాయి. అయితే అమెరికాలోని బ్రియాన్ మోస్ అనే వ్యక్తికి లాటరీల రూపంలో లక్ వల్ల కోట్ల రూపాయలు సొంతమవుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుసార్లు ఆ వ్యక్తి లాటరీ గెలవగా ఆరోసారి బ్రియాన్ కు ఎక్కువ మొత్తం డబ్బు సొంతమైంది.
బ్రియాన్ మోస్ ఆరోసారి లాటరీలో ఏకంగా 2,50,000 డాలర్లు సొంతం చేసుకోవడం గమనార్హం. భారతీయ కరెన్సీ ప్రకారం బ్రియాన్ మోస్ 182 కోట్ల రూపాయల నగదును గెలుచుకున్నాడు. అయితే సాధారణంగా ఎవరైనా లాటరీల ద్వారా డబ్బును గెలుపొందితే ఆ డబ్బును వ్యక్తిగత ఖర్చుల కోసం ఎక్కువగా వినియోగిస్తారు. అయితే బ్రియాన్ మోస్ మాత్రం ఆ డబ్బును సామాజిక సేవ కోసం వినియోగిస్తున్నాడు.
అమెరికాలోని ఇదహో రాష్ట్రానికి చెందిన బ్రియాన్ మోస్ క్రాస్ వర్డ్ స్క్రాచ్ గేమ్ లో లాటరీ విన్ అయ్యాడు. ఆ గేమ్ ద్వారా బియాన్ 182 కోట్ల రూపాయలు సొంతం చేసుకున్నట్టు లాటరీ సంస్థ నిర్వహకులు ప్రకటన చేశారు. లాటరీల్లో గెలిచిన నగదుని బ్రియాన్ విలాసాల కోసం ఖర్చు పెట్టకుండా పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయల కల్పన కొరకు ఖర్చు పెడుతూ ఉండటం గమనార్హం.
బ్రియాన్ లాటరీ ద్వారా సంపాదించిన డబ్బును ప్రభుత్వ విద్యాలయాల బాగు కొరకు ఖర్చు చేయడం ఎంతో ఆనందంగా ఉందని.. ప్రభుత్వ విద్యాలయాల బాగు కోసమే తాను లాటరీలలో పాలగొంటున్నానని తెలిపాడు. లాటరీలో గెలిచిన కొంత మొత్తాన్ని మాత్రం బ్రియాన్ తన కూతురు చదువు కోసం ఖర్చు చేస్తున్నాడు.