
దేశీయ ఈకామర్స్ కంపెనీలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లిప్ కార్ట్ కస్టమర్ల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ‘గ్రూపు సేఫ్ గార్డ్’ ద్వారా ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు తెచ్చిన ఈ పాలసీ వల్ల యాక్ససిరీస్‌లను కొనుగోలు చేస్తే తక్కువ మొత్తం చెల్లించి ఇన్సూరెన్స్ ను పొందే అవకాశం ఉంటుంది. అమెజాన్, ఇతర ఈకామర్స్ కంపెనీల నుంచి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.
కొన్ని రోజుల క్రితం ఫ్లిప్ కార్ట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ క్విక్ పేరుతో హైపర్ లోకల్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. గ్రూపు ఇన్సూరెన్స్ పాలసీని అందించడం కొరకు ఫ్లిప్‌కార్ట్ వ్యాపార భాగస్వామ్యం, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరితే చికిత్సల వ్యయాలను చెల్లించడానికి ఫ్లిప్ కార్ట్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఇరు కంపెనీలు ఉమ్మడిగా ఓ ప్రకటనలో ఈ పాలసీలో ప్రతిరోజూ ఎంచుకున్న మేరకు నగదును చెల్లించాల్సి ఉంటుందని పేర్కొనడం గమనార్హం. హాస్పిక్యాష్ బెనిఫిట్ కింద కనీసం 500 రూపాయల నుంచి గరిష్టంగా ఎంచుకున్న మేరకు ఇన్సూరెన్స్ ను పొందే అవకాశాలు ఉంటాయి. ఇరు కంపెనీల ప్రతినిధులు తక్కువ ధరలకే, కాగిత రహిత, సౌకర్యవంతమైన పాలసీ అందిస్తూ ఉండటం గమనార్హం.
నిర్దేశించుకున్న మేర చికిత్సల కోసం ఆస్పత్రిలో చేరినా లేదా ఆస్పత్రిలో చేరినా ఆస్పత్రుల ద్వారా నగదు ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ తెచ్చిన ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతుంది.