
దేశీయ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ బీమా యోజన పేరుతో ఎల్‌ఐసీ మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలను అమలు చేస్తుండగా అసంఘటిత రంగంలోని వారికి ఈ పాలసీల వల్ల ప్రయోజనం చేకూరనుంది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీలను తీసుకోవచ్చు.
ఇంట్లో కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి ఈ పాలసీని తీసుకోవచ్చు. పేదవాళ్లు మాత్రమే ఈ పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు లాంటి డాక్యుమెంట్లను ఎవరైతే తీసుకుంటారో వాళ్లు ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులు. ఎవరైనా ఈ పాలసీని తీసుకున్న వాళ్లు సహజ మరణం పొందితే 30,000 రూపాయలు కుటుంబ సభ్యులకు ఎల్‌ఐసీ నుంచి అందుతాయి.
ప్రమాదవశాత్తూ మరణిస్తే నామినీ ఏకంగా 75,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. శాశ్వత అంగ వైకల్యం సంభవిస్తే 75,000 రూపాయలు పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే రూ.37,500 పొందే అవకాశం ఉంటుంది. ఈ ఎల్‌ఐసీ పాలసీని తీసుకున్న వాళ్లకు అంగవైకల్యం సంభవిస్తే విద్యార్థుల పిల్లలు కూడా స్కాలర్ షిప్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీ తీసుకోవాలంటే సంవత్సరానికి 200 రూపాయలు ప్రీమియం చెల్లించాలి.
అయితే ప్రీమియంలో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఒక ఫ్యామిలీలో గరిష్టంగా ఇద్దరు పిల్లలు స్కాలర్ షిప్ ను పొందే అవకాశం ఉంటుంది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్ ను పొందవచ్చు.