England Vs New Zealand: వన్డే వరల్డ్ కప్ : ఇద్దరు కొదమ సింహాల్లో గెలుపు ఎవరిది?

అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం ని కనక చూసుకుంటే ఈ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అనే చెప్పాలి.ఇక్కడ ఇరు జట్లు కూడా ఎక్కువ స్కోర్ చేయడం పక్క అని తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : October 5, 2023 12:04 pm

England Vs New Zealand

Follow us on

England Vs New Zealand: ఈ రోజు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ టీమ్ ల మధ్య జరిగే మ్యాచ్ తో వరల్డ్ కప్ టోర్నీ అనేది భారీ ఎత్తున ఇండియా లో ప్రారంభం కానుంది ఇక అందులో భాగంగానే ఇవాళ్టి మొదటి మ్యాచ్ ఆడటానికి సిద్ధం అయినా ఈ రెండు టీంల బలాబలాలు ఏంటి అనేది మనం ఒకేసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఈ రెండు టీం లు కూడా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాయి.గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ ల్లో ఈ రెండు టీములు తలపడి మంచి ఉత్కంఠ ని నెలకొలిపే మ్యాచ్ ని మన ముందుకు తీసుకువచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇక అందులో ఇంగ్లాండ్ విజయం సాధించగా న్యూజిలాండ్ టీం మాత్రం రన్నరప్ గా నిలిచింది.ఇక ఈ మ్యాచ్ లో ఎవరికి వాళ్ళు చాలా బాగా ఆడి ఈ టోర్నీ లో మొదటి మ్యాచ్ లో విజయం సాధించాలని చూస్తున్నారు…ఇప్పటికే న్యూజిలాండ్ టీం 2019 ఫైనల్ లో వాళ్ళకి జరిగిన అవమానాన్ని అధిగమించడానికి ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ని చిత్తు చేయాలనీ చూస్తే డిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్ టీమ్ మాత్రం ఈసారి కూడా కప్పు కొట్టాలంటే మొదట ఆడే మ్యాచ్ లో గెలిచి వరల్డ్ కప్ లో మొదటి విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తుంది…ఇలా రెండు జట్లు కూడా ఆధిపత్యాన్ని చూపించుకోవడానికే ప్రయత్నం చేస్తుంది…

ఇక ఈ రెండు టీంలు ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో 10 సార్లు పోటీ పడితే అందులో రెండు టీములు కూడా చేరో ఐదు విజయాలను దక్కించుకున్నాయి…అయితే ఇంగ్లాండ్ గత ఏడాది రెండు సార్లు వీళ్ల పైన తన ఆధిపత్యాన్ని చూపించింది.కానీ న్యూజిలాండ్ మాత్రం అంతకుముందు జరిగిన వరల్డ్ కప్ లో వీళ్ల మీద గెలవడం జరిగింది…ఇక ఇప్పటి వరకు ఈ రెండు టీముల మధ్య మొత్తం 95 మ్యాచులు జరగగా అందులో ఇంగ్లాండ్ టీమ్ 44 మ్యాచులు గెలిచింది,న్యూజిలాండ్ కూడా 44 మ్యాచుల్లో గెలిచింది. మిగిలిన మ్యాచుల్లో 3 మ్యాచులు టై అవ్వగా,4 మ్యాచులు రద్దయ్యాయి…ఇక ఈ రెండు టీంలు కూడా ఆడిన అన్ని మ్యాచులలో సమానంగా గెలవడం జరిగింది.ఇక రీసెంట్ గా ఆడిన మ్యాచులను కనక చూసుకుంటే ఈ రెండు టీములు 4 వన్డేల్లో తలపడగా అందులో ఇంగ్లాండ్ మూడు మ్యాచుల్లో గెలిస్తే, న్యూజిలాండ్ మాత్రం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది…

ఇక ఒకసారి అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం ని కనక చూసుకుంటే ఈ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అనే చెప్పాలి.ఇక్కడ ఇరు జట్లు కూడా ఎక్కువ స్కోర్ చేయడం పక్క అని తెలుస్తుంది.అయితే ఈ పిచ్ లో ఇంగ్లాండ్ ఇప్పటి వరకు రెండు వన్డేలు ఆడితే అందులో ఒకటి గెలిచి, మరొకటి ఓడిపోయింది.ఇక న్యూజిలాండ్ టీం విషయానికి వస్తే ఈ టీం ఇక్కడ రెండు వన్డేల్లో ఆడితే రెండు వన్డేల్లోకూడా గెలిచింది…

ఇక ఈ రెండు టీంలకి మ్యాచ్ కి ముందే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే న్యూజిలాండ్ టీమ్ కెప్టెన్ అయినా కెన్ విలియం సన్ అలాగే టీం సౌథీ ఇద్దరు కూడా ఈ మ్యాచ్ కి అందుబాటు లో ఉండటం లేదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు పూర్తి ఫిట్నెస్ ని సాదించలేకపోతున్నారు…దానివల్లనే వాళ్ళు ఈ మ్యాచ్ కి అందుబాటు లో ఉండటం లేదు.ఇక ఇంగ్లాండ్ టీం నుంచి అల్ రౌండర్ అయిన బెన్ స్టోక్స్ కూడా ఈ మ్యాచ్ కి అందుబాటు లో ఉండకపోవచ్చు…ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది మనం ఖచ్చితంగా చెప్పడం కష్టమే కానీ ఈ మ్యాచ్ మాత్రం మనకు చాలా ఉత్కంఠ ని రేపుతోంది అని అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు…

ఇక ఈ రెండు టీముల ప్లేయింగ్ 11 కనక ఒకసారి మనం చూసుకుంటే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం లో ఓపెనర్లు గా జాన్ బెయిర్ స్ట్రో , డేవిడ్ మలన్ ఉన్నారు.ఇక ఆ తర్వాత వరుసగా జో రూట్, హరీ బ్రూక్,జొస్ బట్లర్, లియాన్ లివింగ్ స్టన్ లు బ్యాట్సమెన్స్ గా ఉండగా ఇక ఆల్ రౌండర్లు గా మొయిన్ అలీ, సామ్ కరణ్,క్రిస్ వోక్స్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. ఇక బౌలర్లు గా అదిల్ రషీద్, మార్క్ వుడ్ లు ఉన్నారు…

ఇక న్యూజిలాండ్ ప్లేయర్లని కనక చూసుకుంటే ఓపెనర్లు గా డేవిన్ కన్వే, విల్ యంగ్ ఉన్నారు. వీళ్ల తర్వాత డారిల్ మిచెల్,టామ్ లూథమ్,గ్లేన్ పిలిప్స్ జిమ్మీ నిషామ్,మిచెల్ సాంట్నర్ ,ఐష్ సోధి మాట్ హేన్రి,ట్రెంట్ బౌల్ట్ లాకి ఫెర్గుసన్…లాంటి ప్లేయర్లతో ఈ టీంలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి…