https://oktelugu.com/

రేపే డిసెంబర్‌‌ 7.. వరద సాయం మొదలవుతుందా?

గ్రేటర్‌‌ ఎన్నికలు వరదల చుట్టే తిరిగాయి. అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో కూడా వరద సాయం ఇస్తామని ప్రకటించాయి. అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీ రూ.10 వేలు ఇస్తామంటే.. బీజేపీ రూ.25 వేలు, కాంగ్రెస్‌ రూ.50 వేలు ఇస్తామని చెప్పింది.. మొత్తానికి ఎన్నికలు ముగిశాయి. రిజల్ట్‌ కూడా వచ్చింది.. ఎవరికీ మ్యాజిక్‌ ఫిగర్‌‌ కారపోవడంతో ఆయా పార్టీలు మేయర్ పీఠం కోసం కసరత్తులు చేసుకుంటున్నాయి. Also Read: సీన్ రివర్స్‌.. సెటిలర్ల మద్దతు గులాబీకే..! వరద సాయం ఇచ్చేదెవరు? […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 6, 2020 / 01:36 PM IST
    Follow us on


    గ్రేటర్‌‌ ఎన్నికలు వరదల చుట్టే తిరిగాయి. అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో కూడా వరద సాయం ఇస్తామని ప్రకటించాయి. అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీ రూ.10 వేలు ఇస్తామంటే.. బీజేపీ రూ.25 వేలు, కాంగ్రెస్‌ రూ.50 వేలు ఇస్తామని చెప్పింది.. మొత్తానికి ఎన్నికలు ముగిశాయి. రిజల్ట్‌ కూడా వచ్చింది.. ఎవరికీ మ్యాజిక్‌ ఫిగర్‌‌ కారపోవడంతో ఆయా పార్టీలు మేయర్ పీఠం కోసం కసరత్తులు చేసుకుంటున్నాయి.

    Also Read: సీన్ రివర్స్‌.. సెటిలర్ల మద్దతు గులాబీకే..!

    వరద సాయం ఇచ్చేదెవరు?

    గ్రేటర్ ఎన్నికల్లో ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాలేదు. టీఆర్ఎస్‌ 55, బీజేపీకి 48, ఎంఐఎంకు 44, కాంగ్రెస్‌కు 2 సీట్లు వచ్చాయి. అయితే ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌‌ బీజేపీ వల్లే వరద సాయం ఆగిందని, ఎన్నికలు ముగియగానే డిసెంబర్‌‌ 7 నుంచి ఇస్తామని ప్రకటించారు. కానీ, మేయర్‌‌ పీఠానికి సరిపడా మెజారిటీ రాలేదు. ఎంఐఎంతో కలిసి కుర్చి ఎక్కినా.. అందుకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నది. ఈ క్రమంలో వరద సాయం ఇస్తారా..? లేదా..? అనే సందేహం నెలకొంది.

    వరద ప్రభావిత ప్రాంతాల్లో టీఆర్‌‌ఎస్‌ ఎదురుదెబ్బ

    వరద ప్రభావిత ప్రాంతాల్లో టీఆర్‌‌ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయా డివిజన్లలో ఓటమిని మూటగట్టుకున్నది. ఎన్నికలకు ముందు కొన్ని వేల మందికి రూ. 10 వేల సాయం చేసిన ప్రభుత్వం.. బాధితులు ఎక్కువగా ఉండడంతో హఠాత్తుగా నిలిపివేసింది. ఆ వెంటనే గ్రేటర్ ఎన్నికలు నోటిఫికేషన్‌ రావడంతో కోడ్ వల్ల పంపిణీ సాధ్యం కాలేదని, ఎన్నికలు పూర్తవగానే కంటిన్యూ చేస్తామని ప్రకటించింది. కేటీఆర్‌‌ సైతం రోడ్‌షోలలో రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అందరికీ ఇస్తామని చెప్పారు.

    Also Read: పీసీపీ పోస్టు కోసం సీనియర్ల పంచాయితీ!!

    కార్లు, బైకులు కూడా ఇస్తామన్న బీజేపీ

    టీఆర్ఎస్‌ రూ.10 వేలు ఇస్తామంటే బీజేపీ రూ.25 వేలు ఇస్తామని చెప్పింది. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కార్లు పోతే కార్లు..బైకులు పోతే బైకులు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ కూడా బీజేపీకి రెట్టింపు స్థాయిలో సాయం ఇస్తామని చెప్పినా.. జనాలు నమ్మలేదు. రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్‌, కేంద్రలో బీజేపీ రూలింగ్‌లో ఉండడంతో ఆ పార్టీలకే ఓటేశారు.

    పట్టించుకోని పార్టీలు

    ఎన్నికలకు ముందు తాము ఇంత ఇస్తామంటే.. తాము అంతకన్నా ఎక్కువ ఇస్తామని ప్రటించిన పార్టీలు ఎన్నికలు అయిపోయాక పట్టించుకోవడం లేదు. కనీసం వరద సాయం ముచ్చటనే ఎత్తడం లేదు. వాస్తవానికి మేయర్‌‌ పీఠం ఎక్కే పార్టీ సాయం ఇవ్వాలి. ఆ అవకాశం టీఆర్‌‌ఎస్‌ పార్టీకే ఉన్నది.. అధికారంలో ఉన్నది కూడా వాళ్లే కావట్టి.. ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్‌‌ 7 నుంచి వరద సాయం ఇవ్వాలని జనాలు కోరుతున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్