https://oktelugu.com/

కిసాన్ క్రెడిట్ కార్డ్ కావాలా.. కార్డును ఎలా పొందవచ్చంటే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కూడా ఒకటి. రైతులు ఎవరైతే కిసాన్ క్రెడిట్ కార్డును కలిగి ఉంటారో వారికి వ్యవసాయ అవసరాల కొరకు తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేస్తోంది. రైతులతో పాటు పశువులను కలిగి ఉన్నవాళ్లు, మత్స్యకారులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 2, 2021 / 03:28 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కూడా ఒకటి. రైతులు ఎవరైతే కిసాన్ క్రెడిట్ కార్డును కలిగి ఉంటారో వారికి వ్యవసాయ అవసరాల కొరకు తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేస్తోంది. రైతులతో పాటు పశువులను కలిగి ఉన్నవాళ్లు, మత్స్యకారులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

    Also Read: సుకన్య సమృద్ధి ఖాతా ఉందా.. బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే..?

    2021 సంవత్సరం మార్చి నెల నాటికి కేంద్ర ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయల విలువ ఉన్న రుణాలను రైతులకు ఇచ్చి ప్రయోజనం చేకూర్చాలని భావిస్తోంది. కేంద్రం దగ్గర రైతుల భూమి, వారి బయోమెట్రిక్‌ రికార్డుకు సంబంధించిన వివరాలు ఉంటే సులభంగా రుణం పొందే అవకాశం ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ కావాలని భావించే రైతులు ఆన్ లైన్ ద్వారా ఈ కార్డ్ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్స్.. ఎక్కువ రాబడి పొందే ఛాన్స్..?

    మొదట పీఎం కిసాన్ వెబ్ సైట్ లో కిసాన్‌ క్రెడిట్‌ కార్డు దరఖాస్తుకు సంబంధించిన ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో భూమికి సంబంధించిన వివరాలు, పంట వివరాలను నమోదు చేసి పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ఇతర బ్యాంకుల నుంచి కిసాన్ క్రెడిట్ కార్డు లేని వారు గుర్తింపు కార్డులను జత చేసి ఈ కార్డును సులభంగా పొందవచ్చు. సహకార బ్యాంకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు, ఎస్బీఐ, బీఓఐ, ఐడీబీఐ బ్యాంకుల ద్వారా ఈ కార్డును పొందవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    రుపే కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు 3 లక్షల రూపాయల లోపు రుణాలకు 2 శాతం చొప్పున వడ్డీ తగ్గుతుంది. 18 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.