
ఈటల రాజేందర్.. టీఆర్‌ఎస్‌లో సీనియర్ లీడర్. ఒకవిధంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి ఉన్న నేత. ఎలాంటి పెద్దగా రాజకీయ పలుకుబడి లేకుండానే.. స్టూడెంట్ లీడర్ నుంచి ఎదిగిన నాయకుడు. అంతటి సీనియర్ నాయకుడు నిన్న సంచలన వ్యాఖ్యలు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ‘నాకు మంత్రి పదవి ఎవ్వరి జాగీరు కాదని.. తెలంగాణ ఉద్యమ ఫలితం’ అని వ్యాఖ్యానించి టీఆర్ఎస్‌ను షేక్ చేశారు. కేసీఆర్‌తో విభేదాల కారణంగానే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అప్పట్లో ప్రచారం సాగింది.
Also Read: కేసీఆర్ బర్త్‌డే స్పెషల్.. : ఎల్బీ స్టేడియంలో యాగం
తాజాగా.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో రైతువేదిక ప్రారంభం సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు వైరల్ అయ్యాయి. రైతులు వారి సమస్యలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై మాట్లాడిన ఆయన.. ‘నేను మంత్రిగా ఉండొచ్చు గాక.. ఇంకో పదవిలో ఉండొచ్చు గాక.. అయినా.. రైతు ఉద్యమం ఎక్కడ ఉన్నా.. నా మద్దతు వారికి ఉంటుంది’ అని ఈటల ప్రకటించారు.
Also Read: బీజేపీ పట్ల టీఆర్‌ఎస్ మెతక వైఖరి..: అందుకే ఈ దాడులా..?
‘ప్రభుత్వం ఎప్పుడు పేదవారి కోసమే ఉంటుంది అని స్పష్టం చేసిన మంత్రి ఈటల.. ఈ దేశంలో ఇద్దరు మాత్రమే త్యాగమూర్తులు.. ఒకరు దేశానికి రక్తం ధారపోసి భరతమాతను కాపాడుతున్న జవాను అయితే మరొకరు రక్తంను చెమటగా మార్చి దేశానికి సౌభాగ్యం అందించే రైతు’ అని అన్నారు. అలాంటి రైతును ఏడిపించడం ఎవరికి మంచిది కాదని హెచ్చరించారు ఆరోగ్యశాఖ మంత్రి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
దీంతో.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈటల వ్యాఖ్యలు చర్చగా మారాయి. అసలే సీఎం పదవిపై హాట్ చర్చ నడుస్తుండగా.. ఈటల ఇలాంటి కామెంట్లు చేయడం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించాయి. మంత్రి కేటీఆర్ సీఎం కాబోతున్నారని.. ఈ క్రమంలోనే ఇప్పటి కేబినెట్‌లోని వారందరినీ తొలగించి యువ బ్యాచ్‌ను కేటీఆర్ నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. మంత్రి ఈటల పోస్ట్ కూడా ఊస్ట్ అవుతుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈటల వ్యాక్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈటల వ్యాఖ్యలపై ఎవరైనా రెస్పాండ్ అవుతారో లేదో చూడాలి మరి.