https://oktelugu.com/

లవ్ స్టొరీ, టక్ జగదీష్ వివాదంలో క్లారిటీ

‘లవ్ స్టొరీ’, ‘టక్ జగదీష్’ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఏర్పడిన వివాద వ్యవహారంలో ఈ రోజు పూర్తి క్లారిటీ వచ్చింది. వివరాలలోకి వెళితే… నిన్ను కోరి, మజిలీ లాంటి సున్నితమైన ప్రేమ కథలని తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ”టక్ జగదీష్” మూవీ చేస్తున్నారు. గత నెలలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటూ ఏప్రిల్ 16న థియేటర్స్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు. Also Read: టీజర్ తో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 2, 2021 / 03:36 PM IST
    Follow us on


    ‘లవ్ స్టొరీ’, ‘టక్ జగదీష్’ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఏర్పడిన వివాద వ్యవహారంలో ఈ రోజు పూర్తి క్లారిటీ వచ్చింది. వివరాలలోకి వెళితే… నిన్ను కోరి, మజిలీ లాంటి సున్నితమైన ప్రేమ కథలని తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ”టక్ జగదీష్” మూవీ చేస్తున్నారు. గత నెలలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటూ ఏప్రిల్ 16న థియేటర్స్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు.

    Also Read: టీజర్ తో ఆకట్టుకుంటున్న ”సుల్తాన్‌” !

    అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో టక్ జగదీష్ చిత్ర యూనిట్ కి షాక్ ఇస్తూ అదే ఏప్రిల్ 16న మేము కూడా వస్తున్నామంటూ ‘లవ్ స్టొరీ’ మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘టక్ జగదీష్’ చిత్రాన్ని కొనుగోలు చేసి పంపిణీ చేయబోతున్న లక్ష్మణ్ తో సంప్రదింపులు చేశాకనే ‘లవ్ స్టొరీ’ చిత్ర నిర్మాత సునీల్ నారంగ్ విడుదల తేదీని ప్రకటించటం జరిగిందట. ఈ వ్యవహారం తెలియని టక్ జగదీష్ యూనిట్ మేము ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించినా కావాలనే ఇలా చేశారేమో అనుకుని మదన పడ్డారు.

    Also Read: క్రేజీ కలయిక నుండి ఇంట్రస్టింగ్ పోస్టర్ !

    ఈ నేపథ్యంలో క్లాష్ వల్ల ఇద్దరూ నష్టపోతారని హీరో నాని స్వయంగా కలగచేసుకుని రెండు సినిమాల పెద్దలని కూర్చోపెట్టి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నారట. ‘లవ్ స్టొరీ’ చిత్రాన్ని ఏప్రిల్ 16న.. ‘టక్ జగదీష్’ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేసేలా నిర్ణయించారు. అనవసర పంతాలకుపోయి నష్టపోవటం కన్నా ఇలా చేయటమే ఉత్తమమైన పని అని విశ్లేషకులు భావిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్.