https://oktelugu.com/

తిరుపతిలో గెలిచేందుకు పార్టీల ఆరాటం

తిరుపతి ఉప ఎన్నికకు మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నిక కోసం ఇప్పుడు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతీపార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇందులో గెలిస్తేనే మళ్లీ జోష్ వస్తుందని ఆయా పార్టీలు లెక్కల్లో మునిగిపోయాయి. అందుకే అన్ని పార్టీలూ తిరుపతి వైపే చూస్తున్నాయి. Also Read: వైసీపీలో పెరుగుతున్న కుమ్ములాటలు ప్రధానంగా వైసీసీ అధికారంలో ఉంది కాబట్టి, సిట్టింగ్ స్థానాన్ని కంపల్సరీ కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఇక ప్రధాన […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 28, 2020 / 11:25 AM IST
    Follow us on


    తిరుపతి ఉప ఎన్నికకు మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నిక కోసం ఇప్పుడు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతీపార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇందులో గెలిస్తేనే మళ్లీ జోష్ వస్తుందని ఆయా పార్టీలు లెక్కల్లో మునిగిపోయాయి. అందుకే అన్ని పార్టీలూ తిరుపతి వైపే చూస్తున్నాయి.

    Also Read: వైసీపీలో పెరుగుతున్న కుమ్ములాటలు

    ప్రధానంగా వైసీసీ అధికారంలో ఉంది కాబట్టి, సిట్టింగ్ స్థానాన్ని కంపల్సరీ కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి కూడా ఈ ఎన్నిక ఊపిరి పోస్తుందని చెప్పాలి. తిరుపతి ఉప ఎన్నికలో గెలిస్తే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతాయనే చెప్పాలి. టీడీపీ అధినేత చంద్రబాబు తాను బీజేపీతో కలిసి నడవాలని భావిస్తున్నారు. అందుకే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కూటమితో కలిసి నడిచిన చంద్రబాబు రెండేళ్లుగా అటువైపు చూడటం లేదు. కనీసం ఢిల్లీ గడప కూడా తొక్కలేదు. బీజేపీతో వెళితేనే తనకు ప్లస్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

    గతంలో తాను బీజేపీ పొత్తుతోనే గెలవడంతో..అందుకే మరోసారి బీజేపీతో జతకట్టేందుకు ఆరాట పడుతున్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో నేతలు టీడీపీతో పొత్తుకు అంగీకరించడం లేదు. జాతీయ స్థాయి నేతలు కొంత సుముఖంగా ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం పొత్తు వద్దే వద్దని వాదిస్తున్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలతో వారి వైఖరిని మార్చవని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. తిరుపతిలో టీడీపీ గెలిచిన తర్వాత పవన్ కల్యాణ‌్ కూడా టీడీపీతో పొత్తుకు సిద్ధమవుతారంటున్నారు.

    Also Read: నివార్‌‌ బాధితులకు సర్కార్‌‌ సాయం

    అందుకే.. చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా ఒక ఉప ఎన్నిక కోసం ఏకంగా వ్యూహకర్తను బరిలోకి దింపారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు తప్పించి అభివృద్ధి గత 19 నెలలుగా ఏమీ లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గుర్తించారు. అందుకే ఈ ఎన్నికలో గెలుపు ద్వారా ఇటు జగన్ ను దెబ్బకొట్టడమే కాకుండా, అటు బీజేపీని కూడా తన దారికి తెచ్చుకోవచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. మొత్తంగా చూస్తే ఈ తిరుపతి బైపోల్‌ రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులను తీసుకొచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్