https://oktelugu.com/

India : ఒకనాటి భారత్ వ్యతిరేకులు ఈనాడు భారత్ ప్రేమికులుగా ఎలా మారారు?

ఒకనాటి భారత్ వ్యతిరేకులు ఈనాడు భారత్ ప్రేమికులుగా ఎలా మారారు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2023 3:28 pm

    India : షీలా రషీద్.. తెలుగు రాజకీయాల్లో ఈమె ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ జాతీయ రాజకీయాలు ఫాలో అయ్యే అందరికీ ఈమె తెలుసు. కన్నయ్య కుమార్, ఒమర్ ఖాలీ, షీలా రషీద్.. వీళ్లందరూ JNU విద్యార్థులు.. తుకుడే గ్యాంగ్ గా పేరొందింది. పాకిస్తానీ టెర్రరిస్ట్ అఫ్జల్ గురుకు ఉరిశిక్ష పడినప్పుడు వీరు భారత్ ను ముక్కలు ముక్కలుగా చేస్తామని బెదిరించారు. ఇప్పుడు వీరంతా ఎక్కడ ఉన్నారని చూస్తే కన్నయ్య సీపీఐలో చేరి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఒమర్ ఖాలీ ఇప్పటివరకూ జైల్లోనే ఉన్నారు. షీలా రషీద్ ఎక్కడ ఉన్నారని చూస్తే శ్రీనగర్ లోని యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉంది.

    ఎందుకీ ముగ్గురి గురించి ఇంతగా చెప్పాల్సి వస్తోందంటే.. ఒకప్పుడు జైఎన్.యూలో ఉంటూ హిందుత్వ వాదాన్ని టెర్రరిస్టులకు మద్దతుగా మాట్లాడిన ఇదే షీలా రషీద్ తాజాగా ఓ ట్వీట్ పెట్టింది. మధ్య ఆసియాలోని ‘ఇజ్రాయిల్ ’లో హమాస్ మారణకాండ చూశాక.. భారత్ లో ఉన్న మనం ఎంత అదృష్టవంతులం అని పేర్కొంది. భారతీయ సైన్యం, భద్రత దళాలు.. మన సమాజం కోసం ఎంతగా త్యాగం చేస్తున్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జమ్మూ కశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ సిన్హా వీరి ముగ్గురికి కూడా నా ధన్యవాదాలు అని ట్వీట్ చేసింది. ఇదే ఇప్పుడు పెద్ద వార్త అయ్యింది. ఈవిడ JNU లో ఉండగా భారత్ వ్యతిరేక ట్వీట్లు, నినాదాలు చేసేది.. భారత ఆర్మీపై దుమ్మెత్తిపోసేది. కశ్మీరీలను కాల్చేస్తున్నారని ఆరోపించింది. అలాంటి షీలా ఇప్పుడు కశ్మీర్ లో ఉండి భారత్ పై పొగడ్తలు కురిపించడం విశేషం.

    ఒకనాటి భారత్ వ్యతిరేకులు ఈనాడు భారత్ ప్రేమికులుగా ఎలా మారారు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    ఒకనాటి భారత్ వ్యతిరేకులు ఈనాడు భారత్ ప్రేమికులుగా ఎలా మారారు? | Shehla Rashid | Shah Faesal|Ram Talk