వైఫై స్పీడ్ ను పెంచుకోవాలా.. పాటించాల్సిన టిప్స్ ఇవే..?

దేశంలో వైఫై వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా వినియోగించుకునే అవకాశం ఉండటంతో చాలామంది వైఫైని వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. యువత, విద్యార్థులలో చాలామంది ఏదో ఒక సందర్భంలో వైఫైని వినియోగించి ఉంటారు. కరోనా విజృంభణ తరువాత వైఫై వినియోగం భారీగా పెరగడం గమనార్హం. ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోం వల్ల వైఫైని వినియోగించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే వైఫై ఉన్నా కొన్ని సందర్భాల్లో డేటా స్పీడ్ గా […]

Written By: Navya, Updated On : January 27, 2021 10:26 am
Follow us on

దేశంలో వైఫై వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా వినియోగించుకునే అవకాశం ఉండటంతో చాలామంది వైఫైని వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. యువత, విద్యార్థులలో చాలామంది ఏదో ఒక సందర్భంలో వైఫైని వినియోగించి ఉంటారు. కరోనా విజృంభణ తరువాత వైఫై వినియోగం భారీగా పెరగడం గమనార్హం. ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోం వల్ల వైఫైని వినియోగించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.

అయితే వైఫై ఉన్నా కొన్ని సందర్భాల్లో డేటా స్పీడ్ గా రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా సులభంగా వైఫై స్పీడ్ ను పెంచుకోవచ్చు. చాలా సందర్భాల్లో మనం చేసే చిన్నచిన్న తప్పులే వైఫై స్పీడ్ తక్కువగా రావడానికి కారణమవుతూ ఉంటాయి. వైఫై స్పీడ్ పెరగాలంటే మొదట అవసరం లేకపోయినా కనెక్ట్ అయిన ఎలక్ట్రానిక్ పరికరాలను డిస్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది.

వైఫై రూటర్ ను ఆఫ్ చేసి ఆన్ చేయడం ద్వారా కూడా కొన్నిసార్లు వేగం పెరిగే అవకాశం ఉంటుంది. రూటర్ యాంటెన్నాల పొజిషన్ లు మార్చడం వల్ల కూడా వైఫై స్పీడ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో లోపాల వల్ల కూడా వైఫై వేగం తగ్గే అవకాశం ఉంటుంది. fast.com వెబ్ సైట్ ద్వారా ఉపయోగిస్తున్న పరికరాల్లో వైఫై వేగాన్ని తెలుసుకుని అవసరమైతే నెట్ వర్క్ సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోవాలి.

డ్యూయల్ బ్యాండ్ 2.4 గిగాహెర్ట్జ్ నుంచి 5 గిగాహెర్ట్జ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఉన్న రూటర్లను ఎంచుకుంటే మాత్రమే ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలు వాడినా వైఫై సిగ్నల్ సమస్యలు రావు. వైఫై రూటర్ ను గది మద్యలో ఉండేలా చూసుకోవడం వల్ల కూడా వైఫై వేగాన్ని పెంచుకోవడం సాధ్యమవుతుంది.