
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలై చాలా రోజులైంది. మొదట ప్రభుత్వ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ జరగగా ప్రస్తుతం ప్రైవేట్ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. అయితే దేశంలో వ్యాక్సిన్లు తీసుకున్నా చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతున్నారు. అయితే దేశంలో 60 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి విముఖత చూపుతుండటం గమనార్హం. వ్యాక్సిన్ పై విముఖత చూపడానికి సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు ఎన్నో కారణాలు ఉన్నాయి.
60 శాతం మంది పౌరులు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. కొన్ని వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ లో ప్రతికూల ఫలితాలు రావడం కూడా వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడతారని తెలుస్తోంది. భవిష్యత్తులో వ్యాక్సిన్లపై విముఖత చూపే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
మరోవైపు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా కొందరిలో పాజిటివ్ నిర్ధారణ అవుతూ ఉండటం కూడా ప్రజల్లో భయాందోళనకు కారణమవుతోందని తెలుస్తోంది. 14 శాతం మంది తాము కరోనా వ్యాక్సిన్ కు దూరంగా ఉండమని వ్యాక్సిన్ సామర్థ్యంపై అనిశ్చితి వల్ల తాము వ్యాక్సిన్ కు దూరంగా ఉంటామని చెబుతున్నారు. 4 శాతం మంది కరోనా వ్యాక్సిన్లు తమకు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
మరో 4 శాతం మంది ప్రస్తుతం కొత్తరకం కరోనా వైరస్ లను వ్యాక్సిన్లు ఎదుర్కోలేవని చెబుతున్నారు. మరి కొందరు కరోనా బారిన పడితే కొన్ని రోజుల్లో కోలుకుంటున్నామని దానికి కరోనా వ్యాక్సిన్ అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.