
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినా ప్రజల్లో భయాందోళన ఏ మాత్రం తగ్గలేదు సరికదా అంతకంతకూ పెరుగుతోంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో అనేక ఆరోగ్య సమస్యలను గుర్తించామని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు కేవలం ఆరు నెలల్లో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతుండటం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ఎక్కువగా మెదడు లేదా నాడీ సంబంధ సమస్యలతో బాధ పడుతున్నారని తెలుస్తోంది.
రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా కరోనా నుంచి కోలుకున్న వారిలో మానసిక సమస్యలతో బాధ పడే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. కరోనా మెదడులో అనేక మానసిక రుగ్మతలకు కారణమవుతోందని చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొంతమంది కరోనా బాధితులు ఆస్పత్రులలో చేరకపోయినా స్ట్రోక్ లేదా డిప్రెషన్ తో బాధ పడుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కరోనా నుంచి కోలుకున్న తరువాత 33.6 శాతం మందిలో శాస్త్రవేత్తలు మానసిక సమస్యలు, నాడీ సమస్యలను గుర్తించారు. కరోనా సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరిలో కోలుకున్న 90 రోజుల్లోనే మానసిక సమస్యలు గుర్తిస్తున్నామని అన్నారు. తీవ్రమైన రక్తస్రావం, మతిమరుపు, ఇతర మానసిక రుగ్మతలు వారిలో కనిపిస్తున్నాయని తెలిపారు. ఆస్పత్రిలో చేరి కోలుకున్న బాధితుల్లోనే ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సమాచారం.
ఏవైనా మానసిక సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్ సోకని వారు తగిన జాగ్రత్తలు తీసుకుని వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలని శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు.