https://oktelugu.com/

కొత్త స్కూటర్ కొనేవాళ్లకు శుభవార్త.. ఏకంగా రూ.5000 డిస్కౌంట్..?

ప్రముఖ టూవీలర్ కంపెనీలలో ఒకటైన హోండా కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. హోండా యాక్టివా 125 స్కూటర్‌ కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. పాపులర్ స్కూటర్ అయిన హోండా యాక్టివా 125 స్కూటర్‌ కొనుగోలు చేయడం ద్వారా ఏకంగా 5,000 రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. Also Read: స్మార్ట్ ఫోన్ కొనేవాళ్లకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్లు..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 9, 2021 / 11:42 AM IST
    Follow us on

    ప్రముఖ టూవీలర్ కంపెనీలలో ఒకటైన హోండా కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. హోండా యాక్టివా 125 స్కూటర్‌ కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. పాపులర్ స్కూటర్ అయిన హోండా యాక్టివా 125 స్కూటర్‌ కొనుగోలు చేయడం ద్వారా ఏకంగా 5,000 రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు.

    Also Read: స్మార్ట్ ఫోన్ కొనేవాళ్లకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్లు..?

    ఎవరైతే హోండా మోటార్ సైకిల్ ను క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తారో వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఈ ఆఫర్ పొందటానికి అర్హులు. హొండా యాక్టివా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండగా నచ్చిన వేరియంట్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

    Also Read: గ్యాస్ సిలిండర్ ఉన్నవారికి శుభవార్త.. కీలక నిర్ణయం దిశగా మోదీ సర్కార్..?

    హోండా యాక్టివా 125 స్కూటర్ ధర 70,629 రూపాయల నుంచి ప్రారంభం కానుండగా గరిష్ట ధర 77,752 రూపాయల వరకు ఉంటుంది. ఈ ధరలు ఎక్స్ ‌షోరూమ్ ధరలు కాగా ఆన్ రోడ్ ధర ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. స్టాండర్డ్, అలాయ్, డీలక్స్ వేరియంట్లలో హోండా యాక్టివా స్కూటర్ లభ్యమవుతోంది. 124 సీసీ ఇంజిన్ తో తయారైన ఈ స్కూటర్ లో సింగిల్ సిలిండర్ ఎయర్ కూల్డ్ ఇంజిన్ ఉంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    మోండా ఎన్స్‌మ్యాన్స్‌డ్ స్మార్ట్ పవర్, ఏసీజీ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్ , ఫ్రిక్షన్ రిడక్షన్ టెక్నాలజీ, హోండా ఎకో టెక్నాలజీ లాంటి ప్రత్యేకతలను ఈ స్కూటర్ కలిగి ఉంది. సమీపంలోని హోండా షోరూంను సంప్రదించి ఈ స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు.