https://oktelugu.com/

మార్చి 31లోపు కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే.. లేదంటే నష్టపోయే ఛాన్స్..?

2021 సంవత్సరం మార్చి 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అమలులోకి రాబోతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు ఈ నెల 31వ తేదీలోగా కొన్ని పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ పనులను పూర్తి చేయకపోతే మాత్రం నష్టపోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్న కొత్త నిబంధనలపై కూడా అవగాహన ఏర్పరచుకోవాలి. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 9, 2021 / 11:49 AM IST
    Follow us on

    2021 సంవత్సరం మార్చి 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అమలులోకి రాబోతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు ఈ నెల 31వ తేదీలోగా కొన్ని పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ పనులను పూర్తి చేయకపోతే మాత్రం నష్టపోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్న కొత్త నిబంధనలపై కూడా అవగాహన ఏర్పరచుకోవాలి.

    Also Read: కొత్త స్కూటర్ కొనేవాళ్లకు శుభవార్త.. ఏకంగా రూ.5000 డిస్కౌంట్..?

    ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమైన సంగతి తెలిసిందే. బ్యాంకులు విలీనం కావడంతో బ్యాంకుల యొక్క పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు పని చేయకపోవడంతో పాటు పాత చెక్ బుక్కులు చెల్లవు. అందువల్ల ఈ బ్యాంకులలో అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఐఎఫ్ఎస్‌సీ కోడ్ తెలుసుకోవడంతో పాటు కొత్త చెక్ బుక్ తీసుకుంటే మంచిది.

    Also Read: స్మార్ట్ ఫోన్ కొనేవాళ్లకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్లు..?

    కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లోగా ఈ కార్డును పొందే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ అమలు చేస్తున్న వివాద్ సే విశ్వాస్ పథకం ఈ నెల 31 వరకు అమలు కానుండగా ఈ పథకం ద్వారా ఆదాయపు పన్ను బకాయిలను ఒకేసారి సెటిల్‌మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తక్కువ ధరకే హోమ్ లోన్స్ ను అందిస్తున్నాయి. ఈ నెల 31వ తర్వాత వడ్డీ రేట్లు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడే రుణం తీసుకుంటే రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూరుతుంది. 2019 – 20 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన వాళ్లు ఈ నెలాఖరు లోపు జీఎస్టీ రిటర్న్స్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు ఈ నెల 31వ తేదీలోపు ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.