Site icon OkTelugu

VC Sajjanar advice girls: అమ్మాయిలు పెళ్లికి ముందే తొందర పడొద్దు… ఆ పని అస్సలు చేయొద్దు

CP VC Sajjanar advice girls

CP VC Sajjanar advice girls

VC Sajjanar advice girls: మొన్నటి వరకు ప్రేమ పేరుతో మోసాలు జరిగేవి.. ఇప్పుడు పెళ్లి పేరుతో మోసాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో పెళ్లి కుదిరిన వెంటనే అమ్మాయిలు, అబ్బాయిల్‌ చెట్టాపట్టాలేసుకుని తిరగడం కమిట్‌ కావడం.. అంత్యా అయ్యాక హ్యాండ్‌ ఇవ్వడం వంటి ఘటనలు ఇటీవలికాలంలె పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ సీపీ వీసీ.సజ్జనార్‌ యువతను హెచ్చించారు. నిశ్చితార్థం తర్వాత డబ్బు డిమాండ్‌ చేసే మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు.

మోసాలతో ఆందోళన..
పెళ్లి చేసుకోవడాన్ని కూడా కొందరు కమర్షియల్‌గా మార్చుకున్నారు. పెళ్లికి ఇచ్చే కట్నం కోసం కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇక కొందరు శారీరకంగా వాడుకుంటున్నారు. తర్వాత భారీ కట్నం డిమాండ్‌ చేస్తున్నారు. ప్రేమి వివాహాలే కాకుండా తల్లిదండ్రులు ఏర్పరచిన వివాహాల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి.

పోలీసు చర్యలు, సలహాలు
మోసం జరిగినప్పుడు షీ టీమ్స్‌ వాట్సాప్‌ నంబర్‌ 9490616555 లేదా డయల్‌ 100కి వెంటనే సమాచారం అందించాలని సీపీ సూచించారు. ఈ ఫిర్యాదులు వేగవంతమైన చట్టపరమైన చర్యలకు దారితీస్తాయి. పోలీసులు ఇప్పటికే అనేక కేసుల్లో విచారణ జరుపుతున్నారు. పెళ్లికి ముందే తొందరపడవద్దని, ముఖ్యంగా ఆ విషయంలో చాలా జాగ్రత్త అని పేర్కొంటున్నారు.

అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు నివారించాలి. కుటుంబ సభ్యులు, నమ్మకమైన వ్యక్తుల సలహా తీసుకోవటం మంచిది. నేపథ్య తనిఖీలు, డాక్యుమెంట్లు ధ్రువీకరించడం ద్వారా మోసాలను అరికట్టవచ్చు. ఈ హెచ్చరికలు సామాజిక నమ్మకాన్ని పునరుద్ధరించడానికి సహాయపడతాయి.

Exit mobile version