https://oktelugu.com/

తమిళనాడులో వార్‌‌ వన్‌ సైడే.. సీఎం పీఠం ఆయనదే..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. అయితే.. తమిళనాడు ఓటర్ల నాడీ తెలుసుకునేందుకు ఓ ఇంగ్లిష్‌ చానల్‌ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఈసారి ఎన్నికల్లో యూపీఏ కూటమి విజయం సాధించబోతోందని స్పష్టమైంది. యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (UPA) కూటమి 158 సీట్లతో అధికారంలోకి వస్తుందని సర్వే వెల్లడించింది. 2016 ఎన్నికలతో పోలిస్తే.. ఈ కూటమి 60 సీట్లను అధికంగా గెలుచుకొని స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని తెలిపింది. Also Read: సర్వే: బెంగాల్ మమతదే.. మోడీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 9, 2021 / 11:33 AM IST
    Follow us on


    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. అయితే.. తమిళనాడు ఓటర్ల నాడీ తెలుసుకునేందుకు ఓ ఇంగ్లిష్‌ చానల్‌ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఈసారి ఎన్నికల్లో యూపీఏ కూటమి విజయం సాధించబోతోందని స్పష్టమైంది. యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (UPA) కూటమి 158 సీట్లతో అధికారంలోకి వస్తుందని సర్వే వెల్లడించింది. 2016 ఎన్నికలతో పోలిస్తే.. ఈ కూటమి 60 సీట్లను అధికంగా గెలుచుకొని స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని తెలిపింది.

    Also Read: సర్వే: బెంగాల్ మమతదే.. మోడీ ఫెయిల్ అవ్వడం ఖాయమే

    ఇక నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (NDA) కూటమి ఈ ఎన్నికల్లో తన బలాన్ని కోల్పోనుందని సర్వే పేర్కొంది. కిందటిసారి ఎన్నికలతో పోలిస్తే 65 సీట్లు తగ్గుతాయని వెల్లడించింది. 2016 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తమిళనాట 136 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఇక తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరిని చూడనున్నారు అనే ప్రశ్నకు అక్కడి ఓటర్ల నుంచి స్పష్టమైన సమాధానం వచ్చింది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌ను సీఎంగా చూడాలని ఉందని అత్యధికంగా 38.4 శాతం మంది చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పళనిస్వామి వైపు 31 శాతం మంది మొగ్గుచూపారు. వీకే శశికళకు 3.9%, పన్నీరుసెల్వానికి 2.6% శాతం ఓట్లు మాత్రమే రావడం గమనార్హం.

    ఇక.. కొత్తగా పార్టీ స్థాపించి ఎన్నికల బరిలోకి దిగిన కమల్ హాసన్‌ను సీఎంగా చూడాలని ఉందని 7.4 శాతం మంది అభిప్రాయపడ్డారు. రజినీకాంత్‌కు 4.3 శాతం మంది ఓటేశారు. బహుశా ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఈ రకమైన అభిప్రాయం వచ్చి ఉండవచ్చు. ఇక స్టాలిన్ సోదరుడు అళగిరికి అత్యల్పంగా 1.7 మంది మాత్రమే మద్దతు ఇచ్చారు. యూపీఏ కూటమికి 43.2 శాతం ఓటింగ్ నమోదవుతుందని టైమ్స్ నౌ సీ ఓటర్ ఓపీనియన్ ద్వారా తెలిసింది. ఎన్డీఏ కూటమికి 32.1 శాతం ఓటు షేర్ వస్తుందని వెల్లడించింది.

    Also Read: అంటించిన కేంద్రం: రగిలిన విశాఖ ‘ఉక్కు’ ఉద్యమం..

    2016 ఎన్నికలతో పోలిస్తే ఎన్డీయే కూటమికి 11.6 శాతం ఓటింగ్ తగ్గుతుందని పేర్కొంది. ప్రధాని మోదీ పాలన పట్ల తమిళనాట పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమైంది. 51.09 శాతం మంది అసంతృప్తిగా ఉన్నామని అభిప్రాయపడ్డారు. 24.55 శాతం మంది పర్వాలేదని సమాధానమిచ్చారు. 17.29 శాతం మంది నరేంద్ర మోదీ పాలనతో సంతృప్తిగా ఉన్నామని తెలిపారు. తమ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడి కావడం పట్ల డీఎంకే ఎంపీ, కరుణానిధి కుమార్తె కనిమొళి సంతోషం వ్యక్తం చేశారు. అయితే.. సర్వేలో పేర్కొన్న వాటి కంటే చాలా ఎక్కువ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పళనిస్వామి పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఆదేశాల మేరకే చెన్నైలో పాలన సాగుతుండటంపై తమిళ ప్రజలు నిరాశగా ఉన్నారని ఆమె అన్నారు. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్