Heart Attack Pain Or Gas Pain : మారుతున్న కాలం.. మనతోపాటు ఎన్నో కొత్త రోగాలను తెచ్చిపెట్టింది. ఎవ్వరూ ఊహించని కరోనా వచ్చి అందరినీ ‘లాక్ డౌన్’ చేసేసింది. దాదాపు ఏడాది పాటు అందరూ కదలకుండా ఇంట్లోనే కూర్చున్న పరిస్థితి. ఉద్యోగ, ఉపాధి కోల్పోయారు. పెద్ద ఎత్తున ఆర్థిక నష్టాలు వచ్చిపడ్డాయి. సమాజం మారుతున్న కొద్దీ ఇంకా కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.అందుకే ఆదిలోనే నియంత్రిస్తే వాటికి అడ్డుకట్ట వేయవచ్చు.

కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా గుండె సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. గుండెజబ్బుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికి కారణం ఇంట్లో ఉండి ఎక్కువగా కొవ్వు పదార్థాలు తినడం.. జీవనశైలి మారిపోయి విలాసవంతంగా కావడం.. వ్యాయామం చేయకపోవడం లేదా అతిగా చేయడం వంటివి గుండెపోటుకు కేసుల పెరుగుదలకు కారణమైంది.
-గుండెపోటు ఎప్పుడు? ఎలా వస్తుంది?
గుండెపోటు ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పన్నప్పటికీ మీ శరీరంలోని కొన్ని భాగాలు గుండెపోటు రాబోతుందని సూచిస్తాయి. చాతిలో నొప్పి వచ్చినప్పుడు తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. తగిన పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటేనే ప్రాణాలు నిలబడతాయి. అంతే కాని ఏదో గ్యాస్ సమస్య అని తేలిగ్గా తీసుకుంటే ప్రాణాలు పోవచ్చు. గుండెపోటును నిర్లక్ష్యం చేస్తే ఉపద్రవమే ఎదుర్కోవాల్సి వస్తోంది. ముందస్తు జాగ్రత్తగా వ్యవహరించి వైద్యుల సూచనల మేరకు నడుచుకోవడం మంచిది. ఇందుకోసం ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం డేంజరే.
-లక్షణాలు
ఛాతి మధ్యలో నుంచి ఎడమవైపు నొప్పితోపాటు భారంగా ఉంటుంది. నొప్పి భుజాలతోపాటు చేతులకు వ్యాపిస్తుంది. గుండెపోటు ఇతర లక్షణాలు మత్తుగా ఉండడం.. వాంతులు కావడం అవుతాయి. ఈ లక్షణాలు ఏవీ లేకుండా తేలికపాటి లక్షణాలతో కూడా గుండెపోటు సంభవించవచ్చు. దీనిని సైలెంట్ అటాక్ అంటారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు బ్లాక్ అయినప్పుడు గుండెపోటు వస్తుంది. ఇది గుండె కండరాలలో ఆక్సిజన్, పోషకాల కొరతకు దారితీస్తుంది. ఎడమ చేతిలో నొప్పి వచ్చినా గుండెపోటుకు సంకేతంగా చెప్పవచ్చు. చల్లని వాతావరణంలో చెమటపట్టడం ఆనారోగ్య సమస్య. మీ చాతి నొప్పి మెడ, దవడ,భుజాలకు ప్రారంభ బిందువుగా ప్రయాణిస్తే అది గుండెపోటుకు సూచనగా చెప్పొచ్చు.
-అధిక ఎక్సర్ సైజులు ప్రమాదకరమే?
మనదేశంలో ఎంతోమందిని కబళించింది గుండెనొప్పులే. ఎంతో ఎక్సర్ సైజులు చేసిన వారిని కూడా హరించింది. ఈ మధ్యన ఎంతో ఆరోగ్యంగా ఉండే కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా గుండెపోటుతోనే హఠాన్మరణం చెందారు. చిన్న వయసులోనే గుండె జబ్బులతో చాలా మంది మరణిస్తున్నారు. అయినా వారి అలవాట్లు మార్చుకోవడం లేదు. ఫలితంగా నూరేళ్లు పనిచేయాల్సిన అవయవాలు యాభై ఏళ్లకే మూలన పడుతున్నాయి. దీంతో గుండెపోటుతో జీవితాలు చాలిస్తున్నారు. మంచి ఆహారం, వ్యాయామం, యోగా వంటివి చేస్తూ ఉంటే రోగాలు రావని తెలిసినా ఎవరు కూడా లక్ష్య పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఆయుర్దాయం తగ్గించుకుంటున్నారు. చిన్న వయసులోనే గుండెజబ్బులకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. నిండు నూరేళ్లు హాయిగా జీవించాల్సి ఉన్నా మన నిర్లక్ష్యంతో మనమే మన ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నాం.
-అజీర్తి, గ్యాస్ సమస్యలు ఎలా వస్తాయి.? వీటి వల్ల ఛాతిలో నొప్పి
అజీర్తి, గ్యాస్ సమస్యల వల్ల కూడా ఒక్కోసారి నొప్పి వస్తుంది. సమయానికి భోజనం చేయకపోయినట్లయితే కడుపులో పుండ్లు, అల్సర్, అజీర్తి సమస్యలు చుట్టుముడతాయి. దీంతో కూడా కడుపులో నొప్పి వస్తుంది. ఇది కూడా భరించలేనంత బాధగా అనిపిస్తుంది. అందుకే మనం సమయానికి భోజనం చేయాలి. ఎక్కడ ఉన్నా ఎంత పనిలో ఉన్నా తిండి మాత్రం మరిస్తే అంతే. మన ఆరోగ్యం దెబ్బ తింటుంది. సరిగ్గా తిన్నది అరగక.. కడుపులో అమ్లాలు పెరిగితే ఇలానే ఛాతిలో నొప్పి , మంట వస్తాయి. ఎలాంటి నొప్పి అయినా వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకుంటే ఏ ఆపద రాదు. కానీ మనమే సొంత వైద్యం చేయించుకునే క్రమంలో మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుందని అనుకోవడం నిర్లక్ష్యమే అవుతుంది.
గుండెనొప్పి, గ్యాస్ మంట రెండూ ఒకేలా ఉంటాయి.. ఏ నొప్పి అయినా సరే మనం వైద్యులను సంప్రదించడం మరవొద్దు. వారి ఆధ్వర్యంలో పరీక్షలు చేయించుకుంటే అది గుండె నొప్పా, గ్యాస్ట్రిక్ సమస్య అనేది తెలుస్తుంది. మనం ఎప్పుడైనా సొంత తెలివితేటలు వాడి ప్రాణాలు రిస్క్ లో పెట్టవద్దు. డాక్టర్ల పర్యవేక్షణలోనే వ్యాధి నిర్ధారణ చేసుకుని సంబంధిత మందులు వాడుకుని హాయిగా ఉండేందుకు దారులు వెతుక్కోవాలి.
చివరగా ఈ రెండు జబ్బులు రావద్దు అనుకుంటే.. మితమైన ఆహారం తీసుకోవాలి. విచ్చలవిడిగా తింటూ దేహానికి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఫలితంగా జబ్బుల బారిన పడుతూ ప్రాణాలు కోల్పోవద్దు. నూరేళ్లు బతకాల్సిన శరీరాన్ని సమతుల్యత లేని ఆహారం తీసుకుని రిస్క్ లో పెడుతున్నారు. ఇప్పటికైనా గమనించి మంచి ఆహారం తీసుకుని జబ్బులకు దూరంగా ఉండి జీవితాన్ని ఆస్వాదించాలని నిపుణులు సూచిస్తున్నారు.