Vijay Devarakonda: ఓ చిరంజీవి, ఓ రవితేజ, నాని తర్వాత ఈ కాలంలో స్వయంకృషితో ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. మంచి నటనా.. మంచి రూపు, మాటకారితనం.. యువతకు బ్రాండ్ అంబాసిడర్ లా ఉండడంతో విజయ్ మంచిపేరు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి యువత మనసులు కొల్లగొట్టాడు. ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు.

విజయ దేవరకొండ ఏ స్టార్ కు వారసుడు కాదు. అతను హైదరాబాద్‌లోని సాధారణ మధ్యతరగతి సంప్రదాయ కుటుంబానికి చెందినవాడు. హైదరాబాద్ లోని సత్యసాయి స్కూల్లో చదివాడు. తన మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో వినయం, విధేయత, సమతుల్యత, ప్రేమగల క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ సినిమాలో బ్యాలెన్స్‌డ్ క్యారెక్టర్‌తో అలరించాడు. ఈ సినిమాతో ప్రేక్షకుల మదిలో మంచి ముద్రను వేసుకున్నాడు. ఆ సినిమా ఎన్నో ప్రశంసలు అందుకోవడంతో విజయ్ కు సెమీ స్టార్ డమ్ వచ్చింది.
‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ జీవితంలో భారీ మార్పులు వచ్చాయి. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా ఆయన కొన్ని వివాదాస్పద మాటలు మాట్లాడారు. సినిమాపై విమర్శలు చేసినందుకు సీనియర్ పొలిటీషియన్ వీహెచ్ హనుమంతరావును తాతయ్య అని సంభోదించి దుమారం రేపాడు. విజయ్ తన అభిమానులను ఆకట్టుకునేందుకు తన తిరుగుబాటు తరహా ఇమేజ్‌ని అలాగే కొనసాగించడం ప్రారంభించాడు. ఒక రకంగా చెప్పాలంటే అర్జున్ రెడ్డి తరహా క్యారెక్టర్ లోనే విజయ్ దేవరకొండ ఆ తర్వాత కాలంలో జీవించాడు. అప్పుడు కూడా కాస్త వివాదాస్పదమైనా కంటిన్యూ చేశాడు. విజయ్ తన సహజ ప్రతిభ, కృషి ద్వారా తన ఎదుగుదలను తానే సృష్టించుకున్నాడు.. పెద్దవాడయ్యాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
కానీ తన పాపులారిటీని విస్తరించే పేరుతో అతను ప్రమాదకర ఆట ఆడుతున్నాడు. . ఇప్పుడు యష్ మరియు అల్లు అర్జున్‌లతో సమానంగా ‘లైగర్’తో ఫ్యాన్ ఇండియా హీరోగా విజయ్ ఎదుగుతున్నాడు. సినిమాలో కంటెంట్ చెప్పకముందే ఆయన చుట్టూ చేస్తున్న పబ్లిసిటీ పెద్ద దుమారాన్ని రేపుతోంది. విజయ్‌కి అంటగట్టిన అసహ్యకరమైన అంశాలతో కరణ్ జోహార్ ఈ సోకాల్డ్ పబ్లిసిటీకి మూలం అయ్యాడు. ఇటీవల కరణ్ తో ఇంటర్వ్యూ తర్వాత విజయ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు విజయ్ తెలివిగా సమాధానం ఇవ్వలేక తన పేరు తనే చెడగొట్టుకున్నాడు.
కార్లలో శృంగారం చేశావా? అని కరణ్ జోహార్ ప్రశ్నించినప్పుడు.. విజయ్ దేవరకొండ నేను చేసానని సమాధానం ఇచ్చి ఇప్పటివరకూ తనను అభిమానించిన అందరికీ షాక్ ఇచ్చాడు. విజయ్ మంచోడని.. అభిమాన హీరో అని భావించిన యువతీ యువకులకు ఈ పరిణామం మింగుడుపడనిదిగా మారింది. కరణ్ జోహర్ షోలో పాల్గొనేముందు కాస్తంతా విజయ్ కసరత్తు చేయాల్సి ఉండేది. జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంది. కానీ కరణ్ అడిగిన ప్రశ్నకు ఓపెన్ గా సమాధానాలు చెప్పి తన ప్రతిష్టను మసకబార్చుకున్నాడు. ఇప్పటివరకూ ఆరాధించిన వారు కూడా సోషల్ మీడియాలో విజయ్ ను తిడుతున్నారంటే అదే కారణం.
వినోదం కంటే కూడా అసహ్యమైన విషయాల్లో విజయ్ తలదూర్చాడు. ఇది ఒక ప్రధాన స్రవంతి హీరో నుండి వినడానికి ఖచ్చితంగా చేదు విషయమే. ఇటీవల జూబ్లీహిల్స్‌లో అత్యాచారం కేసుగా మారిన కారు శృంగారం సంఘటన కూడా దుమారం రేపింది. అలాంటి ఒక హీరో కారులో శృంగారం చేశానని అనడమే ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇద్దరినీ పోల్చిచూడకున్నా కూడా విజయ్ మాటలను ఎవరూ అంగీకరించడం లేదు.
విజయ్ దేవరకొండ లాంటి నటులు కెమెరా ముందు ఏం మాట్లాడుతున్నారో పట్టించుకోవాలి. అతని అభిమానులలో ఎక్కువ మంది యువకులే. ఈ పనికిమాలిన మాటలు చూసి వారు స్ఫూర్తి పొందుతారా? మీడియా దృష్టిని ఆకర్షించే ముసుగులో విజయ్ దేవరకొండపై తనకు తెలియకుండానే యాంటీ సోషల్ టాక్ తెచ్చుకుంటున్నారు. అతను నోరుజారకుండా ఉంటే పదికాలల పాటు ఉంటారు. లేదంటే కనుమరుగైపోతారు.
Recommended Videos