https://oktelugu.com/

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. వారికి లైఫ్ టైమ్ ఫ్యామిలీ పెన్షన్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు ప్రయోజనం చేకూరేలా కొత్త కుటుంబ పెన్షన్ స్కీమ్ ను తెచ్చింది. పెన్షనర్ లేదా ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు పెన్షన్ అందుతుందనే సంగతి తెలిసిందే. ఈ పెన్షన్ కు సంబంధించిన నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. చనిపోయిన ఉద్యోగి లేదా పెన్షనర్ కుటుంబంలో శారీరక లేదా మానసిక వైకల్యాలు ఉంటే కేంద్రం దీర్ఘకాలం పెన్షన్ ను ఇవ్వనుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 11, 2021 11:13 am
    Follow us on

    Life Time Family Pension

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు ప్రయోజనం చేకూరేలా కొత్త కుటుంబ పెన్షన్ స్కీమ్ ను తెచ్చింది. పెన్షనర్ లేదా ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు పెన్షన్ అందుతుందనే సంగతి తెలిసిందే. ఈ పెన్షన్ కు సంబంధించిన నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. చనిపోయిన ఉద్యోగి లేదా పెన్షనర్ కుటుంబంలో శారీరక లేదా మానసిక వైకల్యాలు ఉంటే కేంద్రం దీర్ఘకాలం పెన్షన్ ను ఇవ్వనుంది.

    Also Read: మోదీ సర్కార్ కొత్త నిబంధనలు.. ఈ సర్వీసులకు ఆధార్ తప్పనిసరి..!

    ప్రస్తుతం మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కుటుంబ సభ్యులకు వార్షికాదాయం బట్టి పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో చేసిన మార్పుల వల్ల దివ్యాంగులైన కుటుంబసభ్యులకు పెన్షన్ వచ్చే విధంగా నిబంధనలు మారాయి. ఫలితంగా ఇకపై పెన్షన్ తీసుకునేవారిలో సాధారణ కుటుంబ సభ్యులు, వైకల్యం ఉన్న సంతానం అనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగాలు..?

    కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ పెన్షన్ నిబంధనలలో కీలక మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. అదే సమయంలో కేంద్రం కుటుంబ పెన్షనర్ చనిపోతే కుటుంబ పెన్షన్ ను మంజూరు చేయడానికి అంగీకరించింది. ఉద్యోగి ఆదాయం, కుటుంబ పెన్షన్ తో పోల్చి చూస్తే సాధారణ రేటుతో కుటుంబ పింఛను తక్కువగా ఉంటుంది. అంటే చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి చివరి వేతనంలో 30 శాతం పెన్షన్ అందే విధంగా కేంద్రం కీలక మార్పులు చేసింది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    సోమవారం రోజు నుంచి కొత్త పెన్షన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. 1972లో సీసీఎస్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులను చేసింది. కేంద్రం నిబంధనల్లో కీలక మార్పులు చేయడం వల్ల పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చింది.