పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బోల్తా

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఎత్తులు పల్టీ కొట్టాయి. అంత సీనియర్‌‌ లీడర్‌‌ అయిన చంద్రబాబు పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలంటూ ప్రయత్నించారు. అందుకే.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ పట్టుబట్టారు. ఎన్నికలు నిర్వహణకు వైసీపీ భయపడిపోతోందని.. ఎన్నికలు జరిపి తీరాల్సిందేనంటూ డిమాండ్‌ చేశారు. కానీ.. చివరకు పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అయింది. Also Read: సుజనా గప్‌చుప్‌..: ఎందుకు సైలెంట్‌ అయినట్లు..! మెజార్టీ గ్రామ పంచాయతీలను ఏకపక్షంగా వైసీపీ గెలుచుకోవడంతో ఇప్పుడు పంచాయతీ […]

Written By: Srinivas, Updated On : February 11, 2021 10:59 am
Follow us on


పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఎత్తులు పల్టీ కొట్టాయి. అంత సీనియర్‌‌ లీడర్‌‌ అయిన చంద్రబాబు పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలంటూ ప్రయత్నించారు. అందుకే.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ పట్టుబట్టారు. ఎన్నికలు నిర్వహణకు వైసీపీ భయపడిపోతోందని.. ఎన్నికలు జరిపి తీరాల్సిందేనంటూ డిమాండ్‌ చేశారు. కానీ.. చివరకు పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అయింది.

Also Read: సుజనా గప్‌చుప్‌..: ఎందుకు సైలెంట్‌ అయినట్లు..!

మెజార్టీ గ్రామ పంచాయతీలను ఏకపక్షంగా వైసీపీ గెలుచుకోవడంతో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ముందు ఎందుకు వచ్చాయా? అని చంద్రబాబు మదనపడుతున్నారు. పార్టీ నేతలు సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే ఈ రిజల్ట్ వచ్చాయని తేల్చేశారు. చంద్రబాబు తొలి నుంచి ఎన్నికల కోసం ఆరాటపడ్డారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించగానే స్వాగతించారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చివరకు చరిత్రలో లేని విధంగా పంచాయతీ ఎన్నికలకూ మేనిఫెస్టో విడుదల చేశారు. ఐదేళ్లలో కేంద్రం నుంచి ఒక్కో పంచాయతీకి ఐదు కోట్ల నిధులు వస్తాయని ఊరించారు.

సర్పంచ్ పదవి ఐదేళ్లు ఉంటుందని, వైసీపీ అధికారంలో ఉండేది రెండేళ్లేనంటూ టీడీపీ నేతల్లో జోష్‌ నింపే ప్రయత్నం చేశారు. కానీ.. 500 పంచాయతీలకు పైగానే ఏకగ్రీవం అయ్యాయి. ఇక తొలి విడత గా 3,249 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే అందులో 500 చోట్ల మాత్రమే టీడీపీ గెలవగలిగింది. మిగిలిన స్థానాలన్నింటిని వైసీపీ గెలుచుకుంది. ఇది చంద్రబాబు ఊహించనిది. ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకున్నా ఓటింగ్ జరిగి ప్రజలు వైసీపీ పక్షాన నిలవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తాము 40 శాతం గ్రామ పంచాయతీలయినా గెలుచుకుంటామని చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. కానీ అది కూడా సాధ్యం కాలేదు.

Also Read: షర్మిల పార్టీ ప్రకటన అప్పుడే..: తేదీ ఖరారు..?

అయితే.. చంద్రబాబు తొలివిడత జరిగిన ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. చిత్తూరు జిల్లాతో సహా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ ఏమాత్రం పుంజుకోలేదనే విషయం వెల్లడైంది. ఇక రాయలసీమ జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఉత్తరాంధ్రలోనూ అదేపరిస్థితి నెలకొంది. కోస్తాంధ్ర జిల్లాలు తమకు కలసి వస్తాయని ఊహించినా అనుకున్న రీతిలో ఫలితాలు రాలేదు. దీంతో అమరావతి రాజధాని అంశం కూడా పెద్దగా పనిచేయలేదు. ఇప్పుడు చంద్రబాబు ఆశలన్నీ పట్టణ ప్రాంతాలపైనే పెట్టుకున్నారు. ఎంపీటీసీ,జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కోసం ఆయన ఎదురుచూడాల్సి వస్తోంది. అయితే.. వైసీపీ గెలుపునకు పోలీసులే కారణమని విమర్శలు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్