Santosh Suman : బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యాన ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఒక్కటి కావడానికి ఈనెల 23వ తేదీన ప్రతిపక్షాల ఐక్యవేదిక పేరిట ఓ సమావేశం జరుగబోతోంది. అందరినీ ఒకచోటకు నితీష్ చేర్చబోతున్నాడు. అదే నితీష్ కుమార్ బీహార్ లోని పరిణామాలను పట్టించుకోవడం లేదు.
నిన్న బీహార్ కేబినెట్ మంత్రి రాజీనామా చేశాడు. దాని వల్ల నితీష్ కుమార్ ప్రభుత్వం పడిపోదు. రాజీనామా చేసింది కేవలం నలుగురు ఎమ్మెల్యేలు. వాళ్లు పోవడం వల్ల ప్రభుత్వం పడిపోదు. అయితే బీహార్ లో మండల రాజకీయాలు కేంద్రీకృతం అయ్యాయి. అక్కడ ఇది జరిగింది చిన్న విషయం కాదు.
ఈ హిందూస్థాన్ అవామీ మోర్చా అంటే మహా దళితులు.. బీహార్ లో మాంఝీ వర్గానికి చెందిన 11శాతం మెజార్టీగా ఉన్నారు. బీహార్ లో 16శాతం ఎస్సీలల్లో 11శాతం ఉన్న జితిన్ రాం మార్జీ కుమారుడు సతీష్ సుమన్ రాజీనామా చేశారు. మైనర్ ఇరిగేషన్, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖ చూస్తున్నాడు.
రాజీనామా చేయడానికి సుమన్ చెప్పిన కారణం ఏంటంటే.. ‘మా పార్టీని జనతాదళ్ లో కలుపాలని ఒత్తిడి చేస్తున్నారు.. మేం కలుపం.. ఆ ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేశామని’ చెప్పాడు. మా పార్టీని విలీనం చేయవద్దని ఇలా చేశామని తెలిపారు.