CM Jagan : జగన్ ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రభుత్వ కార్యక్రమాన్ని ‘నేతన్న నేస్తం’ పేరుతో జరుపుతూ తీవ్ర రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఎన్నెన్నో మాటలు అంటున్నారు. ఎవరెవరో రాసిచ్చినవి కవులను పెట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నాడు. ప్రభుత్వ పథకాలను పొగుడుకోండి తప్పులేదు. కానీ అవతల వ్యక్తులపై విషప్రచారానికి ప్రభుత్వ కార్యక్రమాన్ని వాడుకోవడం పెద్ద తప్పు. ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని ఇలా చేయడం ఆ స్థాయి హుందాతనం తగ్గించుకున్నట్టు అవుతోంది. ఇది కలియుగం కాక మరేంటి? అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు.
జగన్ లో ప్రస్టేషన్ అధమ స్థాయికి చేరుకుంది. తన తాజా ఆరోపణలకు చూపిస్తున్న కారణం వలంటీరు వ్యవస్థపై ఆరోపణలు. అయితే దీనిపై జగన్ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. పవన్ లేవనెత్తిన ప్రశ్నలు, అనుమానాలను నివృత్తి చేయలేదు. కానీ వలంటీర్ల క్యారెక్టర్లపై మాట్లాడతారా? అంటూ కొత్త లింకు పెట్టి కామెంట్స్ చేశారు. నెలరోజులుగా పవన్ జగన్ సర్కారును డ్యామేజ్ చేయగలిగారు. ప్రజల్లో ఒక రకమైన ఆలోచన తీసుకురాగలిగారు. ఇప్పుడు ఏపీ సమాజంలో వలంటీర్ల పాత్రపై బలమైన చర్చ జరుగుతోంది. ఇటువంటి సమయంలో అందరి దృష్టి మరల్చేందుకే పవన్ పై వ్యూహాత్మకంగా జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
నేరాలు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు శ్రీరంగనీతులు చెప్తుంటే కలియుగం కాక మరేంటి? అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.