https://oktelugu.com/

ఆ డాక్టర్ కు 49 మంది పిల్లలు.. ఎలా పుట్టారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

కత్తికి రెండు వైపులా ఏ విధంగా పదును ఉంటుందో టెక్నాలజీకి కూడా రెండు వైపులా అదే విధంగా పదును ఉంటుంది. మెజారిటీ శాతం ప్రజలు టెక్నాలజీని మంచి కోసం వినియోగిస్తే కొందరు మాత్రం చెడు కోసం వినియోగించుకుంటారు. తాజాగా ఒక డాక్టర్ టెక్నాలజీని ఉపయోగించుకున్న విధానం గురించి తెలిసి తోటి వైద్యులే అతనిని చీదరించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా డాక్టర్లను దేవుళ్లుగా చూస్తారు. అయితే ఈ వైద్యుడు చేసిన పని వైద్య జాతినే అవమానించే విధంగా ఉండటం గమనార్హం. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 27, 2020 / 07:22 PM IST
    Follow us on


    కత్తికి రెండు వైపులా ఏ విధంగా పదును ఉంటుందో టెక్నాలజీకి కూడా రెండు వైపులా అదే విధంగా పదును ఉంటుంది. మెజారిటీ శాతం ప్రజలు టెక్నాలజీని మంచి కోసం వినియోగిస్తే కొందరు మాత్రం చెడు కోసం వినియోగించుకుంటారు. తాజాగా ఒక డాక్టర్ టెక్నాలజీని ఉపయోగించుకున్న విధానం గురించి తెలిసి తోటి వైద్యులే అతనిని చీదరించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా డాక్టర్లను దేవుళ్లుగా చూస్తారు.

    అయితే ఈ వైద్యుడు చేసిన పని వైద్య జాతినే అవమానించే విధంగా ఉండటం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే నెదర్లాండ్ దేశంలో జాన్ కర్బాత్ అనే డాక్టర్ ఉన్నాడు. ఇతనికి సొంతంగా ఒక ఆస్పత్రి ఉంది. ఆ ఆస్పత్రి ద్వారా ఐవీఎఫ్ విధానంలో మహిళల అండంలోకి దాతల స్పెర్మ్ ను ప్రవేశపెట్టి పిల్లలు పుట్టేలా చేసేవాడు. స్థానికంగా ఇతనికి మంచిపేరు ఉండటంతో ఇతని దగ్గరకు చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరిగింది.

    అయితే ఈ డాక్టర్ తన దగ్గర చికిత్స కోసం వచ్చిన మహిళలకు తన స్పెర్మ్ ను ఉపయోగించేవాడు. అతను ఎందుకు ఇలాంటి పని చేశాడో ఎవరికీ తెలియదు. అయితే ఆ ఆస్పత్రిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కొందరు మహిళలు కోర్టుకు ఎక్కగా కోర్టు ఆ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న మహిళల పిల్లలందరికీ డీ.ఎన్.ఏ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది. అతని ఆస్పత్రిలో చికిత్స పొందిన 49 మంది మహిళల పిల్లలకు డీ.ఎన్.ఏ మ్యాచ్ కావడం గమనార్హం.

    ఈ ఘటనతో ఆ దేశమే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో దోషిగా తేలితే కఠిన శిక్షలు అమలవుతాయి. అయితే ఆ వ్యక్తి ఇప్పటికే చనిపోవడంతో కోర్టులు సైతం ఏం చేయలేకపోయాయి. ఆ వైద్యుడు కొంతమందితో తనకు 60 మంది పిల్లలు అని చెప్పేవాడని.. ఆ మాటలు తాము పట్టించుకోలేదని.. అతను ఆ విధంగా ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్థమవుతోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.